కాలువలో దిగి.. ఎక్కలేకపోయిన ఏనుగు.. ఆ తర్వాత

Updated on: Nov 22, 2025 | 1:19 PM

కర్ణాటకలోని మళవళ్లిలో నీటి కోసం కాలువలోకి దిగిన ఓ ఏనుగు 50 అడుగుల లోతున చిక్కుకుపోయింది. 48 గంటలపాటు ఆహారం లేకుండా నిస్సహాయంగా ఉండిపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్రేన్‌ల సహాయంతో, మత్తు మందు ఇచ్చి ఏనుగును విజయవంతంగా రక్షించారు. ప్రథమ చికిత్స అనంతరం అడవిలో వదిలిపెట్టనున్నారు.

ఆహారం, నీళ్లు వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తాయి ఏనుగులు. ఎక్కడ నదులు కనిపిస్తే అక్కడ వాటిలో దిగి నీళ్లు తాగుతుంటాయి. అలా నీళ్లు తాగేందుకు ఓ నదిలో దిగిన ఏనుగు తిరిగి పైకి రాలేకపోయింది. ఏకంగా 48 గంటలపాటు నిస్సహాయంగా నదిలోనే ఉండిపోయింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అధికారులు ఏనుగును రక్షించారు.ఈ ఘటన కర్నాటకలో జరిగింది. కర్ణాటకలోని మళవళ్లి తాలూకా శివనసముద్ర కాలువలో నీళ్లు తాగేందుకు ఓ ఏనుగు దిగింది. శనివారం రాత్రి నీటి కోసం వచ్చిన ఏనుగు 50 అడుగుల లోతున్న కాలువలోకి దిగింది. మర్నాడు అటుగా వెళ్తున్న స్థానికులు నదిలో చిక్కుకుపోయి నిస్సహాయంగా చూస్తున్న ఏనుగును గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్తు ఉత్పత్తి కేంద్ర ప్రతినిధులు, అటవీశాఖ సిబ్బంది సోమవారం ఉదయం నుంచి బయటికి తీసేందుకు యత్నించారు. కాలువలోకి నీరు రాకుండా గేట్లను మూసివేసి, ఏనుగుకు ఓ వైపు ఆహారం అందిస్తూ వచ్చారు. క్రేన్‌లో ఎక్కేందుకు ఏనుగు భయపడుతుండగా, దానికి మత్తు ఇచ్చి క్రేన్లతో మంగళవారం మధ్యాహ్నానికి పైకి తీసుకొచ్చారు. పాపం 48 గంటలపాటు ఏనుగు ఆహారం లేకుండా నీటిలో ఉండిపోయిందని అధికారులు తెలిపారు. ప్రథమచికిత్స చేసి, కోలుకున్నాక అడవిలో వదులుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ బాస్‌ హౌస్‌లో వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్‌

కోతికి దశదిన కర్మ.. 4 వేల మందికి భోజనాలు !

ఎరక్కపోయి వెళ్లి.. ఇరుక్కుపోవడమంటే ఇదే

Top 9 ET: విజిల్ కొట్టేందుకు రెడీయా.. | బంగారు బిడ్డకు.. నాన్న నుంచి క్యూట్ విషెస్‌

అది నాలుకా తాటిమట్టా.. తనూజపై దారుణ ట్రోల్స్