Viral: నా శరీరం అప్పగిస్తా.. పరిశోధన చేయండి.! అరుదైన వ్యాధిగ్రస్తుడి మొర.

|

Sep 30, 2024 | 10:35 AM

ఆయనని చూస్తే కర్కోటకుడికైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఒకటికాదు.. రెండు కాదు..నలభై ఏళ్ళుగా మంచానికే పరిమితం అయ్యాడు. కండరాల క్షీణత రోగంతో పోరాటం చేస్తున్నాడు. గతంలోనే మెర్సి కిల్లింగ్ అనుమతులు‌ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు లేఖ రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే వ్యాధిపై పరిశోధన చేయటానికి తన శరీరాన్ని ఉపయోగించుకోవాలని తాజాగా కోరుతున్నాడు కట్ల శ్రీనివాస్.

ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తే కట్ల శ్రీనివాస్‌. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. పదిహేడు‌ ఏళ్ళ వరకు చాలా చురుకుగా ఉన్నాడు.అంతేకాకుండా మంచి అర్టిస్ట్.ఉన్నత చదువులు చదువు కోవాలనే లక్ష్యంతో ముందడుగేశాడు. ఇంతలోపే విధి వక్రీకరించి, కండరాల‌ క్షీణిత వ్యాధి భారిన పడ్డాడు. ఇరవై ఐదేళ్లు వచ్చేసరకి మంచం నుండి లేవలేని దుస్థితి నెలకొంది. ఈ వ్యాధిని నయం‌ చేసే వైద్యం ఇప్పటికీ అందుబాటులో లేదు. ఐదు లక్షల మందిలో ఒకరికి అత్యంత అరుదుగా సోకుతుందట. యోగా, ప్రాణాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. తనలాగ మరొకరు‌ బాధపడకూడదంటూ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ వ్యాధి నయం కావడానికి తన‌ శరీరాన్ని పరిశోధనలు కోసం వాడుకోవాలని కోరుతున్నాడు.

సరైన వైద్యం లేక వ్యాధి సోకిన కొన్నేళ్లకే మృతి చెందిన‌ సంఘటనలు ఉన్నాయి. శరీరంలో ఏ అవయవం కూడా పని చెయ్యదు. నీళ్ళు తాగాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా ఎవరో ఒకరు సహాయం చెయాల్సిందే. అయితే శ్రీనివాస్‌ బాధను చూసి ఓ‌ మహిళ నాలుగేండ్ల క్రితం పెళ్ళి చేసుకుంది. అతని పాలన ప్రస్తుతం ఆమే చూసుకుంటోంది. అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసి కూడ ఆ మహిళ పెళ్ళి చేసుకోవడం‌పై అందరూ ఆమెను అభినందిస్తున్నారు. తన జీవితం శ్రీనివాస్‌కే అంకింతం అంటోంది భార్య పద్మ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on