Kanyadaan: వివాహ సమయంలో కన్యాదానం తప్పనిసరికాదు.! హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.

|

Apr 10, 2024 | 9:28 AM

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి వేడుకల్లో కన్యాదానం నిర్వహించడం తప్పనిసరికాదని అలహాబాద్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ‘సప్తపది' మాత్రం పెళ్లిలో ముఖ్యమైన వేడుక అని స్పష్టం చేసింది. న్యాయమైన నిర్ణయం తీసుకునేందుకు కన్యాదానం జరిగిందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆశ్‌తోశ్ యాదవ్ అనే ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా...

హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి వేడుకల్లో కన్యాదానం నిర్వహించడం తప్పనిసరికాదని అలహాబాద్ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ‘సప్తపది’ మాత్రం పెళ్లిలో ముఖ్యమైన వేడుక అని స్పష్టం చేసింది. న్యాయమైన నిర్ణయం తీసుకునేందుకు కన్యాదానం జరిగిందా లేదా అనేది పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆశ్‌తోశ్ యాదవ్ అనే ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సుభాశ్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మార్చి 22న జారీ చేసిన ఉత్తర్వులో హైకోర్ట్ పేర్కొంది. హిందూ వివాహ ప్రక్రియలో కన్యాదానం కేవలం ఒక వేడుక మాత్రమేనని తెలిపింది. అత్తంటి వారు పెట్టిన కేసు విషయంలో మార్చి 6న లక్నో అదనపు సెషన్స్ కోర్టు జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. అయితే వివాహ రుజువు కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 311 CRPC కింద సాక్షులను కోర్టుకు పిలవలేమని కోర్టు స్పష్టం చేసింది. న్యాయమైన నిర్ణయం తీసుకోవడానికి కన్యాదానం జరిగిందా? లేదా? అనేది ముఖ్యంకాదని పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..