Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్‌కు బలైన ఇంజనీర్.. వికటించిన ఇంజెక్షన్.. వాచిపోయిన మొహం.. వీడియో

హెయిర్ ట్రాన్స్ ప్లాంట్‌కు బలైన ఇంజనీర్.. వికటించిన ఇంజెక్షన్.. వాచిపోయిన మొహం.. వీడియో

Samatha J

|

Updated on: May 17, 2025 | 9:09 AM

బట్టతల సమస్యతో బాధపడే వారికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక వరం. ముందు విగ్గు మాత్రమే పెట్టుకునేవారు. వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారి దగ్గరికే వెళ్లాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నకిలీ నిపుణులు జీవితాలతో ఆడుకుంటున్నారు. కాన్పూర్‌లో ఒక వ్యక్తి చికిత్స తర్వాత ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడి పవర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 37 ఏళ్ల వినీత్ కుమార్ దుబే మృతితో అతని భార్య, ఇద్దరు పిల్లలు విషాదంలో మునిగిపోయారు. క్లినిక్‌లో చికిత్సలో భాగంగా వైద్యురాలు అతనికి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే దుబే ముఖం వాచిపోయింది. ఆస్పత్రిలో చేర్పించిన రెండు రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. క్లినిక్ యజమానిపై సెక్షన్ 146 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో ఇచ్చే అనస్థీషియా వల్లే సమస్యలు వస్తాయి. అయితే నూటిలో ఒకరిద్దరిలో మాత్రమే ఈ సమస్యను ముందుగా గుర్తించవచ్చు. అందుకే చికిత్సకు ముందు బీపీ, షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేస్తారు. అంతేకాకుండా అనస్థీషియా టెస్టింగ్ డోస్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం అలర్జీలు రాకపోతే చికిత్సను ప్రారంభిస్తారు. రెండో ప్రధాన సమస్య హెయిర్ రూట్ ఇన్ఫెక్షన్. దీన్ని పోలికాలైటిస్ అంటారు. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోయినా, వైద్యుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఉంది. బట్టతలపై మళ్లీ వెంట్రుకలు మొలిపించే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విషయంలో చాలామందిలో అనుమానాలు ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

హృదయవిదారకం.. కొడుక్కి తల కొరివి పెట్టిన తల్లి వీడియో

ఇంట్లో తాబేలును ఆ దిశలో ఉంచితే .. పట్టిందల్లా బంగారమే వీడియో

ఈ యువకుడు చేసిన పనికి మీరైతే ఏం చేస్తారు?వీడియో