ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

Updated on: Nov 27, 2025 | 5:15 PM

కడపలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న 600 ఏళ్ల వటవృక్షం ప్రకృతి అద్భుతం. దాదాపు 50 మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ భారీ మర్రిచెట్టు, భక్తులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంది. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం, ఈ పురాతన వృక్షంతో కలిపి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశంగా మారింది. ఈ వృక్షానికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ.

మానవులకంటే ముందే ఈ భూమిపై చెట్లు చేమలూ జీవం పోసుకున్నాయని పెద్దలు చెబుతారు. ఈ ప్రకృతిలో భాగమే మానవుడు కూడా అని అంటారు. అయితే మనిషి ఆయుష్సు 100 సంవత్సరాలు అయితే.. కొందరు వందేళ్లు దాటి కూడా జీవిస్తారు. అయితే కొన్ని మహా వృక్షాలు శతాబ్దాలు తరబడి జీవిస్తూ ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు మన చెప్పుకోబోయే వృక్షం కూడా. కడప జిల్లాలోని శ్రీరాలింగేశ్వరస్వామి దేవాలయంలోని మర్రి చెట్టుకు ఏకంగా 600 ఏళ్ల చరిత్ర ఉంది. కడప నగరానికి శివారు ప్రాంతమైన వాటర్ గండి సమీపంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ మహావృక్షం దర్శనమిస్తుంది. దాదాపు 50 మీటర్ల వైశాల్యం కలిగిన ఈ మహావృక్షం ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తులందరినీ ఆకర్షిస్తుంది. పెన్నా నదికి ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ఎంతో సుందరంగా ఉంటుంది . అనేక వృక్షాలతో నిండి ఉన్న ఈ దేవాలయం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఊడలమర్రి అందరినీ ఆకర్షిస్తుంది . దాదాపు 600 ఏళ్లుగా ఈ వటవృక్షం వేళ్లూనుకొని సజీవంగా ఉందని ఆలయ పూజారులు చెబుతారు. రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఈ వృక్షం ఉంటుంది. ఈ వృక్షాన్ని చూసిన వారంతా ఏ దేవాలయంలో ఇంత పెద్ద ఊడల మర్రి చెట్టును చూడలేదని అంటారు. ఈ చెట్టు ఊడలు నేలలోకి పాతుకుపోవడంతో ఈ చెట్టు మొదలు కనిపించదు. ఈ వృక్షం ఇంకా పెరగాల్సి ఉందని , చెట్టు ఊడలను అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉంటారని, లేకపోతే ఈ ఊడలమర్రి మరింత పెద్దదిగా అయ్యేదని అక్కడి దేవాలయాల అర్చకులు అంటున్నారు. దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు రామలింగేశ్వర స్వామిని పూజించడంతోపాటు ఈ భారీ వటవృక్షానికి కూడా మొక్కుతారని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ