పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చిన భర్త.. అలా ఎలా చేసావ్ భయ్యా

Updated on: Dec 01, 2025 | 6:45 PM

కడప జిల్లాలో తాగుబోతు భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్ళిన భార్యకు ఊహించని షాక్. భర్త ఏకంగా ఆమె బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం పంపాడు. దీంతో ఆశ్చర్యపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరణ ధృవీకరణ పత్రం ఇంత త్వరగా, తప్పుడు వివరాలతో ఎలా జారీ అయిందని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తాగుబోతు భర్తల వేధింపులు భరించలేక కొందరు భార్యలు విసిగిపోయి పుట్టింటికి వెళ్లిపోతారు. అలా పుట్టింటికి వెళ్లిన భార్యకు ఊహించని షాకిచ్చాడు ఓ భర్త. ఆమె చనిపోయినట్టుగా డెత్‌ సర్టిఫికెట్‌ పంపించాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ముద్దనూరు మండలానికి చెందిన మారుతీ రాజు, కలసపాడు మండలం దూలంవారి పల్లె గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి భార్య భర్తలు. గత కొంతకాలంగా మారుతీ రాజు నిత్యం తాగి భార్యను వేధిస్తుండడంతో.. 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన ముగ్గురు పిల్లలను భర్త దగ్గరే వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన భర్త మారుతి రాజు, తనను వదిలి వెళ్లిన భార్య చచ్చినదానితో సమానం అంటూ ఆమె పేరు మీద మరణ ధృవీకరణ పత్రం చేయించి భార్యకు పంపించాడు. దీంతో డెత్‌ సర్టిఫికెట్‌తో కలసపాడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది భార్య. బ్రతికి ఉన్న తనకు తన భర్త డెత్‌ సర్టిఫికెట్‌ పంపాడని, పోలీసులకు తెలిపింది. డెత్‌సర్టిఫికెట్‌ను పరిశీలించగా.. నవబంరు 12వ తేదీన మరణ ధృవీకరణ పత్రం ముద్దనూరు గ్రామ పంచాయతీ నుంచి జారీచేసినట్టు అందులో ఉంది. అయితే అంత త్వరగా మరణ దృవీకరణ పత్రం ఇష్యూ చేస్తారా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని ఎలా ఇష్యూ చేశారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆధారాలు ఏమి ఇచ్చి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నాడు అనే దానిపై ఆరాతీస్తున్నారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మవారి గుడికి వెళ్లిన భక్తులు..దెబ్బకి వెనక్కి పరుగు..

కోనసీమలో ఆకట్టుకుంటున్న గోవా బీచ్..

జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే తెల్ల జుట్టు మాయం

దేశంలోనే రిచ్చెస్ట్ బెగ్గర్.. దిమ్మదిరిగే ఆస్తులకు ఓనర్

Andrea Jeremiah: న్యూడ్ పోస్టర్‌ కలకలం! హీరోయిన్ వైపే అందరి చూపు…