సుడిగాడు.. కొంచెం ఉంటే బస్సు చక్రాల కిందే
కడప జిల్లా పులివెందుల వద్ద ఆర్టీసీ బస్సు నుంచి ఓ యువకుడు జారిపడ్డాడు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తుంది. ప్రయాణికులు భద్రతా నియమాలు పాటించడం అత్యవసరం.
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. బస్సులు తగలబడటం, వాహనాలు ఢీకొని జనాలు నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ప్రయాణికుడు బస్సునుంచి జారిపడిపోయాడు. అతని టైం బావుంది కనుక రెప్పపాటులో తప్పించుకున్నాడు. లేదంటే బస్సుచక్రాలకింద నలిగిపోయేవాడు. ఈ ఘటన కడపజిల్లాలో జరిగింది. కడప జిల్లాలోని పులివెందుల పూలంగండ్ల సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు నుంచి ఓ యువకుడు జారిపడ్డాడు . గురువారం మధ్యాహ్నం పులివెందుల నుంచి తాడిపత్రి వెళ్లేందుకు పూలంగండ్ల సర్కిల్ వద్ద బస్సు ఎక్కాడు. బస్సు కదలగానే యువకుడు అదుపుతప్పి కిందపడిపోయాడు. బస్సుకి కొంచెం దూరంలో పడ్డాడుకనుక సరిపోయింది. లేదంటే అతనిపైనుంచి బస్సు వెళ్లేది. తృటిలో అతను పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అందుకే బస్సులో ఫుట్‌బోర్డ్‌పై నిలబడొద్దని డ్రైవర్లు, కండక్టర్లు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొందరు పట్టించుకోకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతారు. ప్రస్తుత ఘటనలో అతని సుడి బావుంది.. అందుకే బ్రతికి బయటపడ్డాడు అంటూ చర్చించుకున్నారు తోటి ప్రయాణికులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీమల భయంతో ప్రాణాలు తీసుకున్న మహిళ
అదృష్టం అంటే ఇదే.. లక్కీ డ్రాలో పావుకేజీ బంగారం
