అబ్బా.. ఏం వాడకమయ్యా.. రైతన్న తెలివికి సలాం కొట్టాల్సిందే!

Updated on: Dec 21, 2025 | 3:23 PM

కడప జిల్లా రైతు రాంభూపాల్ రెడ్డి తన బైక్‌కు గుంటిక పరికరం అమర్చి పొలంలో కలుపు మొక్కలను విజయవంతంగా తొలగించారు. కూలీల ఖర్చు తగ్గించుకొని, వ్యవసాయ పెట్టుబడిని ఆదా చేసేందుకు చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని స్థానిక రైతులు ప్రశంసించారు. వర్షాల వల్ల పెరిగిన కలుపును తొలగించి, లాభాలు పెంచుకునేందుకు ఈ ఆలోచన ఉపకరించింది.

కష్టపడి పని చేయాలే గాని అనేక ఆలోచనలతో ముందుకు సాగిపోవచ్చు.. మనం చేసే వ్యవసాయ పనుల్లో కూడా కాస్త బుర్రకు పదును పెడితే కష్టమైన పనులను కూడా సాఫీగా సజావుగా కొనసాగించవచ్చని ఓ రైతు నిరూపించాడు. కలుపు మొక్కలు తీసే కూలీలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయని.. తనకున్న బైక్‌తో పొలంలోని కలుపు మొక్కలను తీసే సరికొత్త ఉపాయాన్ని ఆలోచించాడు. కూలీలతో పనిలేకుండా తన బైక్‌తోనే ఈజీ కలుపు తీసుకున్నాడు. కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం తిప్పలూరుకు చెందిన రాంభూపాల్ రెడ్డి అనే రైతు వినూత్న ఆలోచనతో తన పొలంలోని కలుపు మొక్కలను తొలగించారు. ఇటీవల అధిక వర్షాల వలన పంట పొలాల్లో కలుపు మొక్కలు విపరీతంగా పెరగడంతో రైతు కూలీలకు డబ్బులు చెల్లించలేక తన ద్విచక్ర వాహనానికి గుంటిక అనే పరికరాన్ని కట్టి కలుపు మొక్కలు తొలగించుకున్నాడు. తద్వారా తనకు కూలి డబ్బులు ఆదా అవుతాయి కాబట్టి కొంతమేర తాను పంట కోసం పెట్టిన పెట్టుబడిలో, తనకు వచ్చే లాభంలో మరింత కూడగట్టుకునే ఆలోచన చేశారు. గతంలో 10 ఎకరాలలో బుడ్డ సెనగ వేసి ఎకరాకు 15,000 చొప్పున ఖర్చు చేశానని.. అంతకు ముందు కూడా ఉల్లి పంట వేసి నష్టపోయానని అతను తెలిపాడు. ఇక నష్టపోయే ఆలోచన చేయలేదని అందుకే వ్యవసాయాన్ని కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తున్నానని ఆయన అన్నారు. ఏది ఏమైనా రైతు రాంభూపాల్ రెడ్డి చేసిన ఈ పనికి స్థానికంగా ఉన్న రైతులు హర్షం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గర్భిణీ శవాన్ని ఊర్లోకి రాకుండా అడ్డుకున్న గ్రామ పెద్దలు.. ఎందుకంటే

అరుదైన దృశ్యం.. సౌదీ ఎడారిలో మంచు.. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో

అండమాన్‌ నికోబార్‌ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్‌

ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో

డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ