ఉద్యోగం రాలేదని లింక్డ్ఇన్‌లో ‘రెస్ట్ ఇన్ పీస్’ పోస్ట్

Updated on: Apr 10, 2025 | 1:47 PM

చదువుకుని డిగ్రీలు తెచ్చుకున్నా ఉద్యోగ వేటలో ఏళ్లకు ఏళ్లు గడిపేస్తున్న వారు ఎందరో. మరికొందరు పోటీ ప్రపంచంలో ఏదో ఒక ఉద్యోగం అంటూ రాజీ పడాల్సిన పరిస్థితి. అసలు ఉద్యోగాలే దొరకని వారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.

బెంగళూరుకు చెందిన ‘ప్రశాంత్ హరిదాస్’ అనే వ్యక్తి.. మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగెత్తిపోయి.. తనకు తానే లింక్డ్ఇన్‌లో ‘రెస్ట్ ఇన్ పీస్’ అని ఒక పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. మేమున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు. తనను దెయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలనీ తను ఎంత మంచి వాడిని అయినా ఎన్ని రెకమెండేషన్స్ పెట్టినా.. ఈ పోస్ట్ తరువాత తనకు జాబ్ ఇవ్వరని తెలుసుననీ రాసుకొచ్చాడు. తను ఆత్మహత్య చేసుకోనననీ ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనీ రుచి చూడాల్సిన వంటకాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయనీ అన్నాడు. అయితే మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం అని ప్రశాంత్ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్‌పై పలువురు స్పందించారు. ఆ ప్రయాణం ఎంత కఠినంగా ఉందో ఊహించగలననీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయనీ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేసాడు. కానీ మీ ప్రయత్నాలు వృధా కావనీ పట్టు వదలకుండా శ్రమించండి అని మరొకరు కామెంట్ చేశారు. నిరుద్యోగి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలననీ అతని పట్ల సానుభూతి ఉందనీ కరోనా మహమ్మారి అందరినీ ఒంటరిని చేసిందనీ మరొక నెటిజన్‌ రాసాడు. ప్రస్తుత జాబ్ మార్కెట్ మునుపటిలా లేదనీ తల పైకెత్తి చూడండని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో.. వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆనందంగా పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న జంట.. అంతలోనే..

బుడ్డి చిన్నదే.. కానీ లాభాలు అధికం! ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింగ్‌ ఏంటంటే?

Mark Shankar Pawanovich: పవన్ చిన్న కొడుకు.. హెల్త్ బులెటిన్ విడుదల

వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..