బాలుడు చేసిన అల్లరి పనికి రూ. 946 కోట్ల నష్టం !!

|

Jun 15, 2023 | 9:04 AM

ఓ బాలుడు చేసిన అల్లరి పని.. రెస్టారెంట్‌కు 946 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అన్ని కోట్ల నష్టం రావడానికి అతడు ఏం చేశాడో తెలుసా? మొదట టేబుల్ పై ఉన్న సోయా సాస్ బాటిల్ మూత తెరిచి దానిని నాకిన బాలుడు, దాన్ని మళ్లీ అక్కడే పెట్టేశాడు. పోనీ అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు.

ఓ బాలుడు చేసిన అల్లరి పని.. రెస్టారెంట్‌కు 946 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అన్ని కోట్ల నష్టం రావడానికి అతడు ఏం చేశాడో తెలుసా? మొదట టేబుల్ పై ఉన్న సోయా సాస్ బాటిల్ మూత తెరిచి దానిని నాకిన బాలుడు, దాన్ని మళ్లీ అక్కడే పెట్టేశాడు. పోనీ అంతటితో ఆగాడా! అంటే అదీ లేదు. పక్కనున్న టీ కప్పులను చేతికి అందుకొని వాటిని నాలుకతో తాకుతూ లాలాజలం అంటించాడు. ఆపై నోటిలో తన వేలు పెట్టుకుని దానిని తీసి అక్కడున్న ఆహార పదార్థాలపై ఆ వేలును ఉంచాడు. బాలుడు రహస్యంగా చేసిన ఈ పనులన్నిటినీ మరో వ్యక్తి వీడియో తీశాడు. అంతే నిమిషాల వ్యవధిలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో రెస్టారెంట్ లో అమ్మకాలన్నీ పడిపోయాయి. జపాన్‌లోని సుషీ రెస్టారెంట్‌కు చెందిన ఓ ఫ్రాంచైజ్ బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. సదరు బాలుడిపై రెస్టారెంట్ బ్రాంచ్ 3.95 కోట్ల రూపాయల దావా వేయడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలుడు చేసిన పనికి కంపెనీకి దాదాపు 946 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు సుషీ సంస్థ తన దావాలో పేర్కొంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ తెలివికి హ్యాట్సాప్ బాస్.. కాఫీ షాపులోనే కూర్చుని.. జొమాటోలో ఆర్డ‌ర్

ఇదో వెరైటీ మ్యారేజ్ గురూ !! పెళ్లిలో రక్తదానం.. అవయవదానం..

ఇది మొబైల్‌ పిండి మిల్లు.. మీ ఇంటికే వచ్చేస్తుంది !!

భార్య మెడలోని తాలిబొట్టు మాయం.. దొరికితే చెప్పమని ఫ్లెక్సీ పెట్టిన భర్త !!

ఏనుగుతో పెట్టుకున్నాడు.. రూ.40 వేలు ఫైన్‌ కట్టాడు..