మనిషి చితాభస్మంతో రూ.400 కోట్ల వ్యాపారం

|

Oct 25, 2024 | 3:42 PM

వ్యాపారం చేయాలనే కోరిక ఉండాలే గానీ ఎడారిలో ఇసుకను, సముద్రంలో ఉప్పును అమ్మొచ్చని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. ఈ క్రమంలోనే కాటిలోని బూడిదతో కూడా కోట్లు సంపాదించవచ్చని నిరూపించారు జపనీయులు. మనిషి మృతదేహాలు కాలాక వచ్చే బూడిదతో.. అంటే చితాభస్మంతో ఏకంగా 4 వందల కోట్ల రూపాయల బిజినెస్‌ చేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా జపాన్‌లో మాత్రం ఇది మామూలు విషయమేనట.

బతికి ఉన్నప్పుడే మనిషికి విలువ అని చాలామంది అనుకుంటారు. కానీ, జపాన్‌లో జరుగుతున్న వ్యాపారం చూశాక చనిపోయిన తరువాత.. శరీరం బూడిదగా మారాక ఆ విలువ అంతకు మించి పెరుగుతుందని అనిపించక మానదు. జపాన్‌లోని శ్మశానవాటికల దగ్గర డెడ్ బాడీలను దహనం చేసిన తరువాత వచ్చే బూడిద బిజినెస్‌ బ్రహ్మాండంగా రన్ అవుతోందట. సాధారణంగా కుటుంబ సభ్యులు చనిపోతే చితాభస్మాన్ని జాగ్రత్తగా భద్రపరిచి… పవిత్ర నదుల్లో కలిపేయడం మన దగ్గర చాలామంది పాటించే సంప్రదాయం. జపాన్‌లోని పబ్లిక్‌ శ్మశాన వాటికల్లో ఒకప్పుడు బూడిదను నీళ్లలో కలిపేవారు. అయితే ఆ బూడిదలో డెంటల్‌ ఫిల్లింగ్స్‌, బోన్‌ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉంటాయని కొన్నాళ్ల క్రితం గుర్తించింది అక్కడి ప్రభుత్వం. దాంతో ఐదేళ్లలో అక్కడ చనిపోయిన దాదాపు 15 లక్షల మంది డెడ్ బాడీస్ బూడిద నుంచి లోహాలను సేకరించి విక్రయించడం ప్రారంభించారు. దాంతో అక్కడ దాదాపు 400 కోట్లకు పైనే ఆదాయం సమకూరింది. అలా వచ్చిన డబ్బుతో బహిరంగ ప్రదేశాలను అభివృద్ధి చేయడంతోపాటు… దేశవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల నిర్వహణకు ఉపయోగిస్తున్నారట. మొత్తానికి బూడిదను… ఆ… బూడిదే కదా అని తేలికగా తీసేయకూడదని అర్థమవుతోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేళ్ల తర్వాత హైదరాబాద్‌లో.. కొత్తగా అతిపెద్ద రైల్వేస్టేషన్‌

Ghee Coffee: కొవ్వు తగ్గాలంటే ఘీ కాఫీ

బిగ్‌ బాస్‌లో.. టెర్రర్ పుట్టించిన గంగవ్వ దెబ్బకు కంటెస్టెంట్స్‌ హడల్

తన భార్యపై వెకిలి కామెంట్స్‌ చేసినవారికి మాటలతో ఇచ్చి పడేసిన మణికంఠ

మరో చిన్నారికి ప్రాణం పోసిన దేవుడు !! మహేష్ పై ఫ్యాన్స్‌ ప్రశంసలు