ఉద్యోగిని ఆత్మ హత్య.. కుటుంబానికి రూ. 90 కోట్ల పరిహారం

Updated on: Sep 20, 2025 | 1:45 PM

పై అధికారి వేధింపులకు మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో జపాన్ న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. ఉద్యోగిని మృతికి కంపెనీ, దాని ప్రెసిడెంటే బాధ్యులని తేల్చిచెప్పింది. బాధితురాలి కుటుంబానికి 150 మిలియన్ యెన్లు, భారత కరెన్సీలో సుమారు 90 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

జపాన్‌లోని ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ లో సటోమి చేరారు. ఒక మీటింగ్‌లో, ఆమె.. ముందస్తు అనుమతి లేకుండా క్లయింట్లను కలిశారని కంపెనీ ప్రెసిడెంట్ ఆగ్రహించారు. అందరి ముందే ఆమెను ‘వీధి కుక్క’ అంటూ అవమానించారు. మరుసటి రోజు కూడా అదే తరహాలో వేధించడంతో సటోమి మానసిక క్షోభకు గురైంది. ఈ ఘటన తర్వాత సటోమి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. చికిత్స కోసం సెలవు తీసుకున్నప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు 2022 ఆగస్టులో ఆత్మహత్యాయత్నం చేయగా, కోమాలోకి వెళ్లింది. మృత్యువుతో పోరాడి 2023 అక్టోబర్‌లో ప్రాణాలు విడిచింది. తమ కుమార్తె మృతికి కారణమైన కంపెనీపై, దాని ప్రెసిడెంట్‌పై ఆమె తల్లిదండ్రులు న్యాయపోరాటం ప్రారంభించారు. విచారణ జరిపిన టోక్యో జిల్లా కోర్టు, సటోమి మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి, ఆమె ఆత్మహత్యకు ప్రెసిడెంట్ వ్యాఖ్యలే కారణమని నిర్ధారించింది. దీనిని కార్యాలయంలో జరిగిన ప్రమాదంగా పరిగణించింది. కంపెనీని, దాని ప్రెసిడెంట్‌ను బాధ్యులుగా చేస్తూ భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ప్రెసిడెంట్‌ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో సకై ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయగా, డి-యూపీ కార్పొరేషన్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణలు తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ విధానాలను సమీక్షించుకుంటామని హామీ ఇచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్ వద్దు.. పోదాం గ్రౌండ్‌కి అంటున్న కలెక్టర్! ఎక్కడంటే

మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి

‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’ ప్రీమియర్ షో.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ

రోబో శంకర్ మరణం! పట్టరాని దుఃఖంలో ధనుష్‌

కల్కి సీక్వెల్ నుంచి దీపిక తప్పుకోవడం వెనుక ఏం జరిగింది