గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
ప్రకాశం జిల్లా జిల్లెలమూడిలోని శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి జనార్ధనస్వామి ఆలయం శిథిలమైనా, ధ్వజస్తంభం మాత్రం చెక్కుచెదరక నిలిచింది. దాని చుట్టూ పెరిగిన మర్రిచెట్టు పవిత్రత కారణంగా గ్రామస్థులు నరకడానికి ఇష్టపడలేదు. ఆలయం లేకున్నా, ఈ ధ్వజస్తంభాన్ని, మర్రిచెట్టును భక్తులు ఇప్పటికీ పూజిస్తున్నారు. ఇది భారతదేశ జాతీయ వృక్షమైన మర్రిచెట్టు, ధ్వజస్తంభం కలిసి ఒక విశిష్ట ఆధ్యాత్మిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయి.
ప్రకాశంజిల్లా కందుకూరు మండలం జిల్లెలమూడి గ్రామ సమీపంలో జనార్ధనస్వామి ఆలయం ఉండేది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో పాలేరు ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణ ఆలయం శిధిలం కావడంతో మూలవిరాట్టును మరో ప్రాంతానికి తరలించి అక్కడ గుడికట్టారు గ్రామస్థులు… అయితే ఆలయ ధ్వజస్థంభం మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఆలయం శిథిలమైనా అప్పటి ధ్వజస్తంభం మాత్రం చెక్కుచెదరకుండా ఇంకా పూజలు అందుకుంటూనే ఉంది. ధ్వజ స్థంభం చుట్టూ ఓ మర్రి చెట్టు పెరిగిపోవడంతో వందల ఏళ్ళుగా అలా ఉండిపోయింది. ఆలయం లేకపోయిన భక్తులు, గ్రామస్థులు ఈ ధ్వజస్థంభాన్ని సందర్శించి ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. భారతదేశపు జాతీయ వృక్షమైన వట వృక్షాన్ని నరికి జనార్ధనస్వామి ఆలయ ధ్వజస్థంభాన్ని బయటకు తీయడం ఇష్టంలేక అలాగే వదిలేశారట గ్రామస్థులు. మర్రిచెట్టుగా సామాన్యులు పిలుచుకునే వటవృక్షాన్ని హిందువులు పవిత్రంగా భావించి పూజలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. పవిత్రమైన ఈ చెట్టును దేవతలు, మునులు పూజిస్తారని ప్రతీతి. ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై కనిపించాడని పురాణాలు చెబుతాయి. దీంతో ఈ చెట్టును నరకాలంటే ఇష్టంలేని గ్రామస్థులు దాన్ని పెనవేసుకుని ఉన్న జనార్ధనస్వామి ధ్వజస్థంభాన్ని అలాగే వదిలేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
ప్రతిరోజూ టమాటా తింటున్నారా.. ఇది మీకోసమే
Silver Hallmark: వెండి ఆభరణాలకు హాల్‌మార్క్ తప్పనిసరి!
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త.. కట్ చేస్తే సీన్ రివర్స్
