జంపన్న వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని నమ్మకం

Updated on: Jan 29, 2026 | 10:15 AM

మేడారం జాతరలో భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ స్నానాలతో సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. లక్షలాది మంది భక్తులతో జంపన్న వాగు జనసంద్రంగా మారింది. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల పైకి చేరుకోబోతుండటంతో జాతర మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మేడారం మహా జాతర సందర్భంగా జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. లక్షలాది మంది భక్తులు జాతరకు చేరుకుని, ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ వాగులో స్నానమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, పాప వినాశనం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెల పైకి చేరుకోబోతున్న నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాలు జన సంద్రంగా మారాయి. మేడారంకి వచ్చే ప్రతి భక్తుడి తొలి అడుగు జంపన్న వాగులోనే పడుతుంది. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతే భక్తులు సమ్మక్క-సారక్క దేవతల దర్శనం కోసం బారులు తీరుతారు. సంపెంగ వాగుగా ఉన్న దీనికి సమ్మక్క తనయుడు జంపన్న ప్రాణత్యాగం చేసిన తర్వాత జంపన్న వాగుగా పేరు వచ్చిందని భక్తులు విశ్వసిస్తారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌