ఒకే వ్యక్తిని ఒకే నెలలో 7 సార్లు కాటేసిన పాము
పాములు పగపడతాయా లేదా అనేది పక్కన పెడితే ఓ వ్యక్తిని ఒకే నెలలో ఏకంగా ఏడుసార్లు కాటేసింది ఓ పాము. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యంతోపాటు భయాందోళనకు గురిచేసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, బొంకూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని అక్టోబరు నెలలో ఓ పాము కాటేసింది.
పాములు పగపడతాయా లేదా అనేది పక్కన పెడితే ఓ వ్యక్తిని ఒకే నెలలో ఏకంగా ఏడుసార్లు కాటేసింది ఓ పాము. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన స్థానికులను ఆశ్చర్యంతోపాటు భయాందోళనకు గురిచేసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, బొంకూరు గ్రామానికి చెందిన 28 ఏళ్ల యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని అక్టోబరు నెలలో ఓ పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో కొద్ది రోజులకే మళ్లీ అతడిని పాము కాటువేసింది. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు.. నెల రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పాము అతడిని కాటు వేసింది. పాము కాటువేయగానే ఆస్పత్రికి వెళ్లడం..చికిత్స తీసుకుని ఇంటికి రాగానే మళ్లీ పాము కాటువేస్తుండటంతో ఆ యువకుడి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము పగబట్టి తమ కుమారుడిని వెంటాడుతోందని, ఎక్కడి నుంచి వచ్చి కాటు వేస్తుందో కూడా తెలియడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇంటి పరిసరాల్లో ఎక్కడా పాము కనిపించిన దాఖలాలు లేవంటున్నారు. కానీ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఇంట్లో ఉన్న కుమారుడిని కాటు వేసి వెళ్లిపోతోందని వాపోయారు. ఈ వింత ఘటన గురించి గ్రామంలో తెలియడంతో స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. పాము పగబట్టిందేమోనని చర్చించుకున్నారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చి ఆ పాము కాటు వేస్తుందో తెలియక ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఈ ఘటన ఆ గ్రామంలో ఉన్నవారికీ నిద్రను దూరం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chittoor: అమ్మా.. నన్నెందుకిలా వదిలేశావ్.. జాలి కలగలేదా..
Kalki 2898 AD: కల్కి 2కి హీరోయిన్ ఫిక్సయినట్టేనా
స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ