Israel Hamas Conflict: చనిపోయినట్లు నటించినా.. చంపేశారు..! వెలుగులోకి ఉగ్రవాదుల దురాగతాలు.

|

Oct 13, 2023 | 4:30 PM

ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దులోని కిబ్బుజ్‌ రీమ్‌వద్ద జరిగిన నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ మిలిటెంట్లు విరుచుకుపడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న జనాన్ని వెతికి మరీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ చనిపోయినట్లు నటించినా..

ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గాజా సరిహద్దులోని కిబ్బుజ్‌ రీమ్‌వద్ద జరిగిన నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌పై హమాస్‌ మిలిటెంట్లు విరుచుకుపడి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులకు భయపడి చెట్లు, పొదల చాటున దాక్కున్న జనాన్ని వెతికి మరీ మిలిటెంట్లు కాల్చి చంపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ మహిళ చనిపోయినట్లు నటించినా.. ఆమె శ్వాసను గుర్తించి మరీ ఉగ్రవాదులు ప్రాణం తీశారు. ఈ ఘటనను చూస్తుంటే.. హమాస్‌ నరమేధం ఏ స్థాయిలో ఉందో అద్దంపడుతోంది..! ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ టీవీ హోస్ట్‌ మాయన్‌ ఆడమ్‌ చెల్లి మాపల్‌ ఆడమ్‌ తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు వెళ్లింది. కాసేపటికే ఆ ప్రాంతాన్ని హమాస్‌ ఉగ్రవాదులు చుట్టుముట్టడంతో వీరిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారు. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో ఓ ట్రక్కు కింద దాక్కుని చనిపోయినట్లు నటించారు. అయితే, వీరిని ముష్కరులు గుర్తించారు. దగ్గరికొచ్చి చూసి శ్వాస ఉన్నట్లు గుర్తించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాపల్‌ ఆడమ్‌ ప్రాణాలు కోల్పోగా.. ఆమె బాయ్‌ఫ్రెండ్ రోయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చనిపోవడానికి ముందు మాపల్‌ అక్కడి పరిస్థితిని ట్రక్కు కింద నుంచి ఫొటో తీసి తన సోదరికి పంపించింది. ఆ ఫొటోను మాయన్‌ ఆడమ్‌ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ జరిగిన దారుణాన్ని వివరించారు. కాగా మాపల్‌ కొంతకాలం పాటు ఇజ్రాయెల్‌ మిలిటరీలో పనిచేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..