అది కుక్క కాదు.. నా కూతురు ! డిపెండెంట్ హోదా ఇవ్వాలని కోర్టుకెక్కిన మహిళ
అమెరికా లాయర్ అమండా రేనాల్డ్స్ తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ కుక్కను చట్టబద్ధంగా 'డిపెండెంట్'గా గుర్తించాలని IRSపై కేసు వేశారు. దాని పోషణకు ఏటా రూ. 4.5 లక్షలు ఖర్చు చేస్తున్నానని, అది తన కూతురితో సమానమని ఆమె వాదిస్తున్నారు. పెంపుడు జంతువులకు పన్ను రాయితీలు ఇవ్వకపోవడంపై ఆమె సవాల్ చేస్తున్నారు. ఈ విచిత్ర కేసు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా పిల్లలకో, పెద్దవారైన తల్లిదండ్రులకో ప్రభుత్వం నుంచి పన్ను రాయితీలు పొందడానికి ‘డిపెండెంట్’ హోదా కోరుతుంటారు చాలా మంది. కానీ అమెరికాలోని ఓ మహిళ తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ కుక్కను చట్టబద్ధంగా తనపై ఆధారపడిన డిపెండెంట్‌గా గుర్తించాలని అమండా రేనాల్డ్ అనే లేడీ లాయర్.. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) పై కేసు వేశారు. ఆ కుక్క పోషణ కోసం ఏటా తాను రూ. 4.5 లక్షలు ఖర్చు చేస్తున్నానని, దానికి తాను తప్ప మరొక ఆధారం లేదని, కనుక దానికి పన్ను రాయితీలు పొందే హక్కు ఉండాలని ఆమె వాదించారు. అది కేవలం పెంపుడు జంతువు మాత్రమే కాదని, అది తన కూతురితో సమానం అంటూ ఆమె వేసిన పిటిషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్, యూటా రాష్ట్రాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న అమండా రేనాల్డ్స్ . తన ఎనిమిదేళ్ల గోల్డెన్ రిట్రీవర్ ను లీగల్ డిపెండెంట్‌గా గుర్తించాలని పిటిషన్ వేశారు. ఆ కుక్క అన్ని విధాలా తన కూతురితో సమానమనీ ఆహారం, నివాసం, వైద్యం ఇలా ప్రతిదానికీ అది తన పైనే ఆధారపడి ఉందనీ అన్నారు దానికి డిపెండెంట్ హోదా ఎందుకు ఇవ్వకూడదు అని ఆమె కోర్టును ప్రశ్నించారు. కుక్క పోషణ కోసం తాను ఏటా సుమారు 5,000 డాలర్లు అంటే భారత కరెన్సీ లో రూ. 4.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఆమె అన్నారు. ఈ కేసులో తన వాదన కొందరికి విచిత్రంగా అనిపించినా.. ఇది బొత్తిగా కొట్టిపారేయలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పటికే సర్వీస్ డాగ్స్ వంటి కొన్ని జంతువులకు పరిమిత పన్ను ప్రయోజనాలిస్తూ.. సాధారణ పెంపుడు జంతువులకు ఆ హోదా ఇవ్వకపోవడం పన్ను చెల్లింపుదారులపై అదనపు భారం మోపడమేనని ఆమె వాదించారు. అయితే, ఈ కేసులో ఐఆర్ఎస్ కొట్టివేత పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని భావిస్తూ మేజిస్ట్రేట్ జడ్జి జేమ్స్ ఎం. విక్స్ ప్రస్తుతానికి విచారణ ప్రక్రియను నిలిపివేశారు. 2023 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం అమెరికాలో 62 శాతం మంది ప్రజల దగ్గర పెంపుడు జంతువులున్నాయి, వారిలో 97 శాతం మంది వాటిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని తేలింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం పెళ్లిరా బాబూ.. AIని పెళ్లాడిన జపాన్ యువతి
Demon Pavan: మారుతున్న బిగ్‌బాస్ ఓటింగ్ ట్రెండ్ దూసుకొస్తున్న డీమాన్
Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్
Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా