ఎవరో ఆ లక్కీ మ్యాన్‌.. రూ. 2 వేల కోట్ల లాటరీ కొట్టేసాడు

Updated on: Jun 25, 2025 | 5:46 PM

లాటరీలో లక్షలు, కోట్లు గెలుచుకున్న వాళ్ల వార్తలను మనం మీడియాలో చూస్తుంటాం. అదృష్టం కలిసొచ్చి.. అలా లాటరీ తగిలిన వారి జీవితాలు ఎంతగా మారిపోతాయో కూడా మనకు తెలుసు. అయితే, మనం ఇప్పుడు చెప్పుకోబోయే మనిషికి పట్టింది అలాంటి ఇలాంటి అదృష్టం కాదు.. లాటరీలో ఏకంగా రూ. 2 వేల కోట్లు గెలుచుకునే అంతటి అదృష్టం.

యూరోప్ దేశాల లాటరీ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మొత్తం గెలిచిన అదృష్టవంతుడిగా నిలిచాడు ఈ యువకుడు. ఐర్లాండ్‌కు చెందిన ఈ సింగిల్‌ టికెట్‌ కొనుగోలుదారుడు యూరో మిలియన్స్‌ జాక్‌పాట్‌లో అక్షరాలా 208 మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ. 2,120 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. ఈ దెబ్బతో.. ఏకంగా 2025 సండే టైమ్స్ రిచ్ లిస్ట్‌లోని బ్రిటన్ ధనవంతుల జాబితాలో ఒకడిగా నిలిచాడు. మరోవైపు, ఈ విషయాన్ని ఐరిష్‌‌ నేషనల్‌‌ లాటరీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ సియాన్‌‌ మర్ఫీ బుధవారం నిర్ధారించారు. యూరప్‌‌లోనే ఇది అతి పెద్ద ప్రైజ్‌‌ మనీ అనీ, కనుక సదరు వ్యక్తి.. తన లాటరీ టికెట్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలని, వీలైనంత తొందరగా తమ హెడ్ క్వార్టర్స్‌ను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లయిన అమ్మాయిలే టార్గెట్.. సైకో పైశాచిక ఆనందం