Internet Explorer: ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు సమాధి.. ఘనంగా నివాళులర్పించిన ఓ అభిమాని.. నెట్టింట వైరల్…

|

Jun 23, 2022 | 8:57 AM

ఇంట‌ర్నెట్ తొలిత‌రం బ్రౌజ‌ర్ ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవ‌ల‌ను ఇటీవ‌లే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. గూగుల్ రంగ‌ప్రవేశంతో ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌ను నెటిజ‌న్లు ప‌క్కకు పడేయడంతో


ఇంట‌ర్నెట్ తొలిత‌రం బ్రౌజ‌ర్ ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవ‌ల‌ను ఇటీవ‌లే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. గూగుల్ రంగ‌ప్రవేశంతో ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌ను నెటిజ‌న్లు ప‌క్కకు పడేయడంతో అది మ‌రుగున‌ప‌డిపోయింది. ఇంటర్నెట్ ఎక్సోప్లోర‌ర్ 1995లో అందుబాటులోకి వ‌చ్చింది. దాదాపు 27 సంవ‌త్సరాల‌పాటు సేవ‌లు అందించింది. కాగా, ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ద‌క్షిణ కొరియా వ్యక్తి భావోద్వేగానికి గుర‌య్యాడు. ఏకంగా దానికి స‌మాధి క‌ట్టి, నివాళి అర్పించాడు.ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఎక్కువగా ఉప‌యోగించేవారు. దక్షిణ కొరియన్లు 2014 వరకు ఆన్‌లైన్ షాపింగ్, బ్యాంకింగ్ కోసం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌పైనే ఆధార‌ప‌డ్డారు. దీంతో ఒక అభిమాని ద‌క్షిణ కొరియాలోని గ్యుయోంగ్జు నగరంలో ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌కు స్మారక చిహ్నాన్ని నిర్మించాడు. ‘ఇతర బ్రౌజర్లను డౌన్‌లోడ్ చేసేందుకు ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ మంచి సాధ‌నం’ అని ఆ స‌మాధిపై రాశాడు. ఈ స‌మాధి ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటో చూసి ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు నెటిజ‌న్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 23, 2022 08:57 AM