world most dangerous tree: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన చెట్టు.. దీని పండు బాంబులా పేలుతోంది.వైరల్ అవుతున్న వీడియో

world most dangerous tree: ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన చెట్టు.. దీని పండు బాంబులా పేలుతోంది.వైరల్ అవుతున్న వీడియో

Anil kumar poka

|

Updated on: Jan 27, 2022 | 7:29 AM

ప్రపంచంలో కొన్ని ప్రమాదకరమైన, విషపూరితమైన చెట్లు ఉన్నాయి. ఇవి ఎవరినైనా సులువుగా చంపగలవు. అలాంటి ఒక చెట్టు గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో కొన్ని ప్రమాదకరమైన, విషపూరితమైన చెట్లు ఉన్నాయి. ఇవి ఎవరినైనా సులువుగా చంపగలవు. అలాంటి ఒక చెట్టు గురించి తెలుసుకుందాం.మానవుల జీవితంలో చెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. చెట్లను ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పవచ్చు. చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ కొన్ని చెట్లు మానవులను ప్రమాదంలో పడేస్తాయి.శాండ్‌బాక్స్ అనే చెట్టు 100 అడుగుల (30 మీటర్లు) వరకు ఉంటుంది. ఉత్తర, దక్షిణ అమెరికాతో సహా అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో పెరుగుతుంది. ఈ చెట్టు పండు గుమ్మడికాయలా కనిపిస్తుంది కానీ చాలా విషపూరితమైనది.ఈ చెట్లు పండ్లు బాంబులా పేలుతాయి. ఆ సమయంలో ఎవరైనా ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశాలు ఉన్నాయి. దాని విత్తనాలు మొత్తం ముళ్ల రూపంలో ఉంటాయి. ఈ ముల్లు మీ శరీరానికి తగిలితే చనిపోయే ప్రమాదం ఉంటుంది.ఈ చెట్టు ప్రతి భాగం కూడా చాలా ప్రమాదకరమైనది. చాలా ప్రాణాంతకం కూడా. ఈ చెట్ల నుంచి వెలువడే ద్రవం మీ కంటి చూపును నాశనం చేస్తుంది. మిమ్మల్ని క్షణాల్లో అంధుడిని చేస్తుంది. ఈ చెట్టు ఎక్కడైనా కనిపిస్తే వాటికి దూరంగా ఉండటం మంచిది.