దోమలను ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ??

Updated on: Nov 29, 2025 | 11:38 AM

బ్రెజిల్ డెంగ్యూ మహమ్మారిని ఎదుర్కోవడానికి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. లక్షల వోల్బాకియా దోమలను పెంచి, వాటిని జనవాసాల్లో వదులుతోంది. ఈ దోమలు డెంగ్యూ వైరస్‌ను వ్యాపింపజేయకుండా అడ్డుకుంటాయి. ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లుగా, దోమలతోనే డెంగ్యూను నియంత్రించి, ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఇది. ఇది ఇతర దేశాల్లో విజయవంతమైంది.

పెయ్యి మీద దోమ వాలితే ఎవరైనా ఏం చేస్తారు? ఫట్‌మని చరిచి చంపేస్తారు.. ప్రాణాలను హరించే దోమల నివారణకు అనేక దేశాల్లో ప్రభుత్వాలు కోట్ల కొద్దీ నిధులు ఖర్చు చేస్తుంటాయి. కానీ బ్రెజిల్‌లో మాత్రం దోమలను పెంచుతున్నారు. పెంచడమే కాదు ఫ్యాక్టరీ పెట్టి మరీ దోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వమే ఒక ఫామ్‌ పెట్టి మరీ దోమల పెంపకాన్ని చేపడుతోంది. పైగా మరో ఆశ్యర్యకరమైన విషయం ఏంటంటే.. పెంచిన ఆ దోమల్ని తీసుకెళ్లి జనావాసాల మధ్య వదిలేస్తారు. వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా? దోమలతో డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వస్తాయని ప్రపంచం మొత్తం వాటిని చంపాలని చూస్తుంటే వీళ్లు పెంచుతున్నారేంటి అని చాలా మంది అనుకోవచ్చు. అయితే వాళ్లు అలా దోమల్ని పెంచేది డెంగ్యూని పూర్తిగా అరికట్టేందుకేనట. బ్రెజిల్ ఇటీవలే సౌత్ పాలో రాష్ట్రంలోని క్యాంపినాస్ అనే నగరంలో ఒక భారీ దోమల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ భవనం దాదాపు 1,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. పైగా ఈ కేంద్ర ప్రపంచ దోమల కార్యక్రమం కింద నడుస్తుంది. ఈ కర్మాగారంలో ప్రతి వారం 190 మిలియన్ ఏడిస్ ఈజిప్టి దోమలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2024లో బ్రెజిల్లో డెంగ్యూ తీవ్రస్థాయిలో విజృంభించింది. ఇది బ్రెజిల్‌ చరిత్రలో అత్యంత దారుణమైనది. ఆ సంవత్సరం ప్రపంచంలోని మొత్తం డెంగ్యూ ఇన్ఫెక్షన్లలో 80 శాతానికి పైగా ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఈ సంక్షోభం కారణంగా శాస్త్రవేత్తలు కొత్త, శక్తివంతమైన పరిష్కారం కోసం శ్రమించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాన్సెప్ట్‌తో దోమల్ని దోమలతోనే దెబ్బకొట్టాలని డిసైడ్‌ అయ్యారు. ఆ ఆలోచనతోనే ఇంత పెద్ద మొత్తంలో దోమల ప్రాజెక్టును రూపొందించారు. ఫ్యాక్టరీలో దోమలు వోల్బాచియా అనే సహజ బాక్టీరియంతో సంక్రమించేలా చేస్తున్నారు. ఈ బాక్టీరియం దోమకు హానికరం కాదు, కానీ డెంగ్యూ వైరస్ దాని శరీరం లోపల పెరగకుండా నిరోధిస్తుంది. ఈ వోల్బాచియా వాహక దోమలు మనుషులను కుట్టినప్పుడు డెంగ్యూ వైరస్‌ను వ్యాప్తి చేయలేవు. కాలక్రమేణా ఈ దోమలు సహజ దోమల జనాభాతో కలిసిపోతాయి. డెంగ్యూను వ్యాప్తి చేసే దోమల సంఖ్య తగ్గుతుంది. వోల్బాచియాను మోసే దోమలు సాధారణ అడవి దోమలతో జతకట్టినప్పుడు, రక్షిత బ్యాక్టీరియా వాటి సంతానానికి వ్యాపిస్తుంది. క్రమంగా అడవిలో ఎక్కువ దోమలు వోల్బాచియాను మోసుకెళ్లడం ప్రారంభిస్తాయి. ఇది జరిగిన తర్వాత అవి డెంగ్యూను వ్యాప్తి చేయలేవు, ఇది సంక్రమణ రేటును శాశ్వతంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ఇండోనేషియా, కొలంబియా వంటి దేశాలలో వోల్బాచియా పద్ధతి ఇప్పటికే విజయవంతమైంది. అక్కడ ఇది డెంగ్యూ కేసులను దాదాపు 70 శాతం తగ్గించడంలో సహాయపడింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేంద్రం సంచలన నిర్ణయం.. 2 కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు ??

TOP 9 ET News: జక్కన్న కిర్రాక్‌ ప్లాన్ !! ఈ సారి హాలీవుడ్‌ షేకవ్వడం పక్కా

Manchu Lakshmi: వాళ్ల వల్ల నేను అనుభవించిన బాధ.. నా ఒక్కదానికే తెలుసు

మంగ్లీని పచ్చి బూతులు తిడుతూ వీడియో.. దెబ్బకు జైల్లో పెట్టించిన సింగర్

Hema Chandra: విడాకుల పై ప్రశ్నించినందుకు.. యాంకర్‌కు ఇచ్చిపడేసిన సింగర్ హేమచంద్ర

Published on: Nov 29, 2025 11:29 AM