ప్రయాణికుడిపై పడిన వేడి వేడి కూర.. విమాన సంస్థకు దిమ్మ తిరిగే జరిమానా
ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై వేడి నాన్ వెజ్ కూర పడిన ఘటనపై వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. ఈ ఘటన 2024 మార్చి 5న బ్యాంకాక్-బెంగళూరు విమానంలో జరిగింది. బాధితుడు శాఖాహారి కావడం, మానసిక వేదనకు గురవ్వడంతో ఫోరం ఇండిగోకు ₹25 వేల జరిమానా విధించింది. ₹20 వేలు బాధితుడికి, ₹5 వేలు పిటిషన్ ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వార్తల్లో నిలిచింది. ఆ సంస్థకు చెందిన విమానంలో ప్రయాణికుడిపై వేడి నాన్ వెజ్ కూర పడటంతో.. బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. దానిపై విచారించిన ఫోరమ్ ఇండిగోకు రూ.25 వేల జరిమానా విధించింది. 2024 మార్చిలో ప్రయాణికుడిపై వేడి కూర పడిన ఘటన జరిగింది. 2024 మార్చి 5న బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఇండిగో విమానంలో సిబ్బంది ఫుడ్ సర్వ్ చేస్తున్న సమయంలో వేడికూర ఓ ప్రయాణికుడిపై పడింది. దాంతో ఆయన దుస్తులు పాడయ్యాయి. వెంటనే సిబ్బంది క్షమాపణలు తెలిపారు. విషయం తెలుసుకున్న విమానయాన సంస్థ పరిహారంగా రూ.5 వేల ట్రావెల్ వోచర్‌ను ఆఫర్ చేసింది. అయితే ఆయన దాన్ని తిరస్కరించారు. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ‘వేడి కూర పడటంతో తన శరీరం కాలిందనీ తను శాఖాహారిని అనీ మాంసాహారం మీద పడటంతో ఆ వాసన భరించలేకపోయాననీ ప్రయాణికుడు వాపోయారు. తన దుస్తులు, ఫోన్, వాచ్ అన్నీ పాడయ్యాయనీ తోటి వారి ముందు నవ్వులపాలయ్యాననీ విమానం దిగేంత వరకు మానసిక వేదన అనుభవించాననీ తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇదంతా జరిగిందని తెలిపారు. ఇందుకుగానూ విమానయాన సంస్థ నుంచి రూ.5 లక్షల పరిహారం కావాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బాధితుడికి రూ.20 వేలు చెల్లించాలని, పిటిషన్ ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు ఇవ్వాలని ఇండిగోను ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: రోజు రోజుకి భారీగా పడిపోతున్న బంగారం, వెండి ధరలు
ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే ప్రీ-యోగా’ ఫుడ్స్
ఆ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ ధర.. రూ 2.08 కోట్లు .. కొన్నది ఎవరంటే ??
కోటి సంపాదిస్తూ పన్నులు కట్టే టెకీ కి భద్రత ఏది ?? వైరల్‌గా పోస్ట్
అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదా ?? చార్జీలు బాది రూ. 8 వేల కోట్లు సంపాదించిన బ్యాంకులు