భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
పెద్ద నోట్ల రద్దు.. ఈ పదం వినగానే పరేషాన్ కాకండి.. ఎందుకంటే ఇప్పుడేమీ పెద్ద నోట్ల రద్దు చేసే ఆలోచన లేదని ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను కొట్టిపారేసింది. అయితే ఇప్పటి వరకు మనం వెయ్యి, రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే చూసి ఉంటాం. కానీ భారత్‌లో వెయ్యి, పదివేల రూపాయల నోట్లు చలామణిలో ఉండేవనే విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఏంటీ.. భారత్‌లో పదివేల రూపాయల నోటా అని ప్రజంట్ జనరేషన్ షాకైనా ఆశ్చర్యపోనక్కరలేదు.
దాదాపు 8 దశాబ్దాల క్రితం భారతదేశంలో 10 వేల రూపాయిల నోట్లు చెలామణిలో ఉండేవి. మనం చూసిన వెయ్యి, రెండు వేల నోట్లు ఎలా ఉండేవో.. 86 ఏళ్ల క్రితం మన దేశంలో 10 వేల రూపాయిల నోట్లు ఉండేవి. దేశంలో ఇప్పటి వరకు ముద్రించిన అదిపెద్ద డినామినేషన్ నోటు ఇదే కావడం విశేషం. 1978, జనవరి 16న జనతా ప్రభుత్వ హయాంలో ప్రధాని మొరార్జీ దేశాయ్ రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.1000 నోట్లను రద్దు చేశారు. అప్పటి రూ.1000 నోటు 20.3 సెం.మీ వెడల్పు, 12.7 సెం.మీ. పొడవున సుమారు పావు ఠావు పరిమాణంలో ఉండేది. దీనికి ముందువైపు మూడు సింహాలు, వెనుకవైపు తంజావూరులోని బృహదీశ్వరాలయం చిత్రాలను ముద్రించారు.రూ.5,000, రూ.10,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భావించారు. పరిశీలన కూడా జరిగింది. తిరిగి రావచ్చని సూచించారు, అయితే చివరికి ఆ ఆలోచనను ఆర్బీఐ విరమించుకుంది.