
టార్నెట్ లోని నోక్స్‌లీ అవెన్యూలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఉన్నట్టుండి ఆదివారం రాత్రి ఇంటి బయటకొచ్చింది. ఆమె చేతిలో దీపం ఉంది. ఆమె రోడ్డు మీద కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లింది. రోడ్డు చివరన ఆగి దీపాన్ని నేల పై ఉంచింది. చెప్పులు తీసేసి దణ్ణం పెట్టుకుంది. వెంట ఆమెతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఆ వెంటనే ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా అడుగులేస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. మహిళ దీపాన్ని రోడ్డు మధ్యలో ఉంచుతున్న వీడియో సీసీ టీవీలో రికార్డయింది. దీనిని గమనించిన గుర్జీత్ అనే నివాసి స్థానిక వార్తా సంస్థ ‘విండ్‌హామ్ టీవీ’ కి సమాచారం అందించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. వీడియో చూసిన స్థానిక భారత కమ్యూనిటీలో అలజడి మొదలైంది. ఆమె చేసిన చర్య మూఢనమ్మకానికి సంబంధించి లేదా కుటుంబ ఆచారమై ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు విదేశాలలో ఇలాంటి పనులు చేపట్టడం వల్ల స్థానికంగా భారతీయ సమాజంపై వ్యతిరేక అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
వీధిలో దీపం ఉంచాలని ఏ భారత సాంప్రదాయంలో లేదనీ పోస్టులు పెడుతున్నారు. కొందరు మరింత దూరం వెళ్లి ఆమె ఇంట్లో క్షుద్రపూజ జరిగిందనడానికి ఇంత కన్నా ఆధారం ఏముంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వేళ అలా జరిగి అది మెల్ బోర్న్ అధికారుల దృష్టికి వెళితే అది భారత కమ్యూనిటీకి తీరని నష్టం కలిగిస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లే రోడ్డు మీద ఎందుకా పని చేశావు బుద్ధిలేదా? అని మరికొందరు నెటిజన్లు తిట్టి పోస్తున్నారు.
Ikkadiki Vachi kuda Ivi Em panulu ra babu 🤦🤦
An Indian man living in Melbourne’s west has been left terrified after two strangers performed a ritual he fears is linked to “black magic” outside his home.
The pair, who are also of Indian subcontinental appearance, were caught… pic.twitter.com/2Sybsy3Pub
— Australian Telugu Films (@AuTelugu_Films) September 1, 2026
అయితే, ఆ మహిళ రోడ్డుపై అంత అకస్మాత్తుగా దీపం ఎందుకు పెట్టిందనేదానికి అసలు కారణం ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. అది చేతబడికి సంబంధించినదేనని నిరూపించడానికి ఎటువంటి అధికారిక ఆధారాలు లేనప్పటికీ, భద్రతాపరమైన అంశాల విషయంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నడిరోడ్డుపై అలాంటి వస్తువులను వదిలివేయడం వల్ల రాత్రివేళల్లో ప్రయాణించే వాహనదారులు, పాదచారులకు తీవ్రమైన ప్రమాదాలు ముప్పు పొంచి వుందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.