రైల్వేలో అరుదైన ఘటన.. 10 నెలల చిన్నారికి రైల్వే జాబ్ !! ఎలాంగంటే ??
ఆగ్నేయ మధ్య రైల్వేలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పది నెలల చిన్నారికి రైల్వే జాబ్ ఇచ్చారు ఛత్తీస్‌గఢ్ రైల్వే అధికారులు.
ఆగ్నేయ మధ్య రైల్వేలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పది నెలల చిన్నారికి రైల్వే జాబ్ ఇచ్చారు ఛత్తీస్‌గఢ్ రైల్వే అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే ఉద్యోగి అయిన రాజేంద్ర కుమార్ యాదవ్ తన భార్య, బిడ్డతో కలిసి బిలాయ్ వెళ్తుండగా రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో రాజేంద్రకుమార్, అతని భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. 10 నెలల చిన్నారి రాధిక ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిన్నారికి ఆపన్నహస్తం అందించారు రైల్వే అధికారులు. కారుణ్య నియామకం కింద చిన్నారికి ఉద్యోగం ఇచ్చింది రైల్వే శాఖ. ఇందులో భాగంగా రాధిక వేలి ముద్రలు సేకరించారు. చిన్నారికి 18 ఏళ్లు నిండాక ఉద్యోగంలో చేరేందుకు అర్హురాలు అవుతుందని తెలిపారు. చిన్నారికి ఉద్యోగానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను జూలై 6న అధికారులు పూర్తి చేశారు ఆగ్నేయ మధ్య రైల్వే చరిత్రలోనే ఈ నియామకం ప్రత్యేకమైనదని, ఇంత చిన్న వయసులో కారుణ్య నియామకం ఓ రికార్డని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బడికి వెళ్లాల్సిన వయసులో బతుకుబండి లాగుతూ.. మనసులు కదిలిస్తున్న చిన్నారి వీడియో
వాటర్ ట్యాంక్‌పై ఊరేగిన నవదంపతులు !! హనీమూన్ వాయిదా వేస్తూ ప్రత్యేక బోర్డులు
అప్పుడే ఇంట్లోకి వచ్చిన యజమాని.. వయ్యారంగా నడిచి వెళ్లి స్వాగతం చెప్పిన డాగీ
ఓర్నీ బండబడా.. ప్రాణమంటే అంత చులకనా.. ఈ డేంజర్ ప్రయాణం తగదంటున్న నెటిజనం