Mohammed Shami: శ‌భాష్ ష‌మీ.! రోడ్డు ప్రమాదం బాధితుడిని కాపాడిన భారత్‌ ఫేసర్‌.. వీడియో వైరల్.

|

Nov 28, 2023 | 6:24 PM

భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మద్ ష‌మీ మాన‌వ‌త్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఓ వ్యక్తిని షమీ రక్షించాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా నెట్టింట షేర్‌ చేస్తూ... అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న మా కారు ముందు మరో కారు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి వెళ్లిపోయింది.

భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మద్ ష‌మీ మాన‌వ‌త్వం చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదం బారిన పడ్డ ఓ వ్యక్తిని షమీ రక్షించాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా నెట్టింట షేర్‌ చేస్తూ… అతడు చాలా అదృష్టవంతుడు. దేవుడు అతడికి పునర్జన్మనిచ్చాడు. నైనిటాల్‌లో ఘాట్ రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న మా కారు ముందు మరో కారు వేగంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చిన్నపాటి లోయలోకి వెళ్లిపోయింది. వెంటనే మా కారు ఆపి అతని వద్దకు పరుగెత్తాము. ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించి బయటకు తీసుకొచ్చామని షమీ తన క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ముహమ్మద్ షమీ భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల తరువాత బరిలోకి దిగిన షమీ ఏకంగా 24 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే, ఫైనల్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.