Bangladesh Ship: బంగ్లా నౌకలో సముద్రపు దొంగల బీభత్సం.! నిఘా పెట్టిన భారత యుద్ధ నౌక..
సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ నౌకకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్ నౌక నుంచి అత్యవసర సందేశం రావడంతో అప్రమత్తమైన భారత యుద్ధనౌక బంగ్లా నౌకపై నిఘా పెట్టిందని భారత నావికాదళం తెలిపింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ అబ్దుల్లా నౌక 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మపుటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరింది.
సముద్రపు దొంగల ఆధీనంలో ఉన్న బంగ్లాదేశ్ నౌకకు భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక స్పందించింది. బంగ్లాదేశ్ నౌక నుంచి అత్యవసర సందేశం రావడంతో అప్రమత్తమైన భారత యుద్ధనౌక బంగ్లా నౌకపై నిఘా పెట్టిందని భారత నావికాదళం తెలిపింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ అబ్దుల్లా నౌక 55,000 టన్నుల బొగ్గుతో మొజాంబిక్ రాజధాని మపుటో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు బయలుదేరింది. మార్చి 12న సోమాలియా తీరంలో సాయుధులైన సముద్రపు దొంగలు ఆ కార్గో షిప్‌పై దాడి చేశారు. అందులోకి చేరుకోవడంతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన 23 మంది సిబ్బందిని నిర్బంధించారు. అత్యవసర ఎస్‌ఓఎస్ సందేశానికి ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌక వెంటనే స్పందించింది. లాంగ్ రేంజ్ మారిటైమ్ పాట్రోల్ విమానాన్ని రంగంలోకి దించింది. ఎంవీ అబ్దుల్లా కార్గో షిప్‌ను అది సమీపించింది. సాయుధులైన సముద్ర దొంగలు ఆ షిప్‌లో ఉన్నట్లు గమనించింది. సిబ్బంది పరిస్థితి గురించి తెలుసుకునేందుకు కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించింది. అయితే ఆ షిప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని భారత నౌకాదళం తెలిపింది. ఈ నేపథ్యంలో దానిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.