“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

Updated on: Jan 15, 2026 | 2:37 PM

భారత్‌ కు చెందిన ఆదిత్య ప్రకాష్, అతని భాగస్వామి ఊర్మి భట్టాచార్య అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. అయితే 2023 సెప్టెంబర్ 5న ఆదిత్య ప్రకాష్ తన మధ్యాహ్న భోజన సమయంలో తన వెంట తీసుకెళ్లిన పాలక్ పనీర్‌ను వేడి చేసుకోవాలని భావించారు. డిపార్ట్‌మెంట్‌లోని మైక్రో ఓవెన్‌లో పాలక్ పనీర్‌ను వేడి చేస్తుండగా.. ఒక స్టాఫ్ మెంబర్ వచ్చి ఆ ఆహారం వాసన భరించలేకుండా ఉందని, దానిని వేడి చేయవద్దని అభ్యంతర పెట్టారు.

దానికి ఆదిత్య బదులిస్తూ.. “ఇది కేవలం ఆహారం మాత్రమే. వేడి చేసుకుని వెళ్లిపోతాను” అని దృఢంగా చెప్పారు. అయితే ఈ చిన్న ఘటన తర్వాత ఆదిత్యపై యూనివర్సిటీ యంత్రాంగం నిరంతరం వేధింపులకు పాల్పడిందని బాధితులు ఆరోపించారు. వివక్షపై ఆదిత్య ప్రశ్నించినందుకు యూనివర్సిటీ అతనిపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముఖ్యంగా ఊర్మి భట్టాచార్య ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని కోల్పోయారు. క్యాంపస్‌లో భారతీయ ఆహారం తెచ్చినందుకు.. వీరిద్దరూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని నిందలు వేశారు. పీహెచ్‌డీ మధ్యలో విద్యార్థులకు అందజేసే మాస్టర్స్ డిగ్రీలను కూడా యూనివర్సిటీ వీరికి అందించడానికి నిరాకరించింది. అక్కడితో ఆగకుండా నిరంతరం మీటింగ్‌లకు పిలుస్తూ.. స్టాఫ్‌కు భద్రత లేదని ఆరోపిస్తూ వారిని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ

 

Published on: Jan 15, 2026 02:35 PM