India vs Pakistan: భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల ఛేజ్.!

|

Nov 23, 2024 | 5:50 PM

భారత మత్స్యకారులను బంధించి తీసుకెళుతున్న పాకిస్థాన్ షిప్ ను భారత కోస్ట్ గార్డ్ షిప్ వెంటాడింది. అరేబియా సముద్రంలో దాదాపు రెండు గంటల పాటు ఛేజ్ చేసి పాక్ అధికారుల చెర నుంచి మత్స్యకారులను విడిపించింది. మత్స్యకారులను సురక్షితంగా తీరం చేర్చింది. భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అరేబియా సముద్రంలో నో ఫిషింగ్ జోన్ సమీపంలో భారత మత్స్యకారుల బోటును పాక్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ నౌక అడ్డగించింది.

ఏడుగురు మత్స్యకారులను బంధించి తమ దేశం తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది పాకిస్థాన్. పాక్ నౌక దాడి చేయడం ప్రారంభించగానే మత్స్యకారులు భారత కోస్ట్ గార్డ్ కు సమాచారం అందించారు. తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు కోస్ట్ గార్డ్ నౌకను మత్స్యకారుల రెస్క్యూ కోసం పంపించారు. భారత్- పాక్ మారటైమ్ సరిహద్దుకు చేరుకున్న కోస్ట్ గార్డ్ నౌక.. పాకిస్థాన్ నౌకను వెంటాడి అడ్డగించింది. పాక్‌ అధికారుల చెరనుంచి ఏడుగురు భారత మత్స్యకారులను విడిపించి తీరానికి చేర్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.