ఫస్ట్‌ నైట్‌ తర్వాత రోజే విడిపోయిన దంపతులు.. భర్త చేసిన పనికి నవ వధువు షాక్‌ వీడియో

Updated on: May 30, 2025 | 2:21 PM

ఫస్ట్ నైట్ తర్వాతి రోజే నవ దంపతులు విడిపోయారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో చోటుచేసుకుంది. ఇటీవలే వధువు వరుడికి వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరోవ రోజున దంపతులిద్దరికీ శోభనం కార్యక్రమం నిర్వహించారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కోపం నషాలని కంటింది. వధువుకు తెలియకుండా కూల్ డ్రింక్ లో బీరు, పాలలో మత్తుమందు కలిపి తాగించాడు.

ఈ విషయాన్ని వధువు తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చివరకు ఇరు కుటుంబాలు పెళ్లి రద్దు చేసుకున్నాయి. మీర్జాపూర్ జిల్లాలోని కాచ్వాన్ కు చెందిన యువకుడితో వారణాసి జిల్లాలోని కస్పేటికి చెందిన యువతికి మే 15న వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన సాంప్రదాయక వివాహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక ఆరోవ రోజున ఇద్దరికి ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. తనను మోసం చేసి డ్రగ్స్ ఇచ్చారని తెలుసుకున్న వధువు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆమెను అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్లారు.

మరిన్ని వీడియోల కోసం :

పని చేద్దామని పొలంలోకి వెళ్లిన రైతు.. ఒక్కసారిగా షాక్ వీడియో

చెట్టు కింద పడుకున్న వ్యక్తి.. మట్టి పోసి చంపేశారా..! అసలేం జరిగింది?వీడియో

కస్టమర్‌ను చితకబాదిన జెప్టో డెలివరీ బోయ్‌.. ఎందుకో తెలిస్తే వీడియో