ఆటో అన్న.. నీ ఐడియా అదుర్స్.. ఏం చేశాడో తెలిస్తే షాకే వీడియో
కాకినాడ జిల్లా పెద్దాపుడి మండలం అచ్చూతాపురానికి చెందిన భాస్కర్ రావు గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుందని మూడు నెలల కిందట ఈ ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికి కూడా చార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో ఆ ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్ గా పనిచేసే మిత్రుడి సాయం కోరాడు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణ రహితంతో కూడిన ఆటోను రూపొందించారు.
ఆటో పైభాగాన సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసి ఈ ఆటోను సోలార్ ఆటోగా మార్చేశారు. దీనికి ₹30,000 ఖర్చు అయిందని ఆటో డ్రైవర్ తెలిపారు.ప్యానెల్ తో పాటు ఒక్కసారి చార్జింగ్ పెడితే 8 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించొచ్చని ఆటో డ్రైవర్ భాస్కర్ రావు చెబుతున్నారు. ఆటో నిర్వహణ ఖర్చు సైతం గతంలో కంటే బాగా తగ్గిందని వర్షాకాల సమయంలో మాత్రం చార్జింగ్ పెడతానని వివరించారు ఆటో డ్రైవర్. నా ఫ్రెండ్ ఒక టెక్నీషియన్ ఉన్నాడు. అతని సలహా తీసుకొని ఈ సోలార్ బోర్డు ఇవన్నీ తెప్పించుకొని అతని చేత నేను అన్నీ బిగింపించుకున్నాను. అది ఎండున్నంత సేపు మనం నడుస్తూనే ఉంటది. మబ్బులుగా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటది. బాగా రెండు రోజులు మూడు రోజులు మబ్బులు ఉంటే చార్జింగ్ పెట్టుకోవాలి తప్ప లేకపోతే అదేదో టు అవర్స్ పెడితే సరిపోతుంది. ఇదివరకైతే సోలార్ లేనప్పుడు ఎయిట్ అవర్స్ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు టు అవర్స్ పెట్టుకుంటే మనకి బూస్టింగ్ సరిపోతుందని.
మరిన్ని వీడియోల కోసం :