మోదీ గ్రేట్ లీడర్..! కానీ.. వీడియో
మనోడికి మతి చెడిందేమో అనే అనుమానాలను జనం వ్యక్తం చేస్తున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా మొదటి టర్మ్ లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ట్రంప్ రెండోసారి గద్దానే కాక మతిలేని మాటలు మాట్లాడుతూ ప్రపంచ దేశాల ముందు నవ్వులపాలు అవుతున్నారు. దింతో తమతో ఎప్పుడు స్నేహంగా ఉంటారో, ఎప్పుడు శత్రువుగా మారిపోతారో అనే అయోమయంలో పలు దేశాధినేతలు పడిపోతున్నారు. ట్రేడ్ వార్ పేరుతో అనేక మిత్రదేశాలను దూరం చేసుకుంటూ వచ్చిన ట్రంప్ రష్యా చమురు కొంటుందనే నెపంతో భారత్ మీద 50 శాతం శుంకాలను విధించారు. దీంతో భారత్ రష్యా చైనా లతో చర్చలకు మొగ్గడంతో ఒక్కసారిగా ట్రంప్ షాక్ తిన్నారు. కానీ అంతలోనే తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
భారీ పనుల నేపథ్యంలో భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ ను చైనాను కోల్పోయాం అంటూ ఇటీవల ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా లో పేర్కొన్నారు. దానిపై తాజాగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ వ్యవహరిస్తున్న తీరు నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. రష్యా నుంచి పెద్ద మొత్తంలో వారు చమురు కొనుగోలు చేస్తున్నారు. వారు వెనక్కి తగ్గకపోవడంతోనే భారత దిగుమతులపై భారీ పనులు విధించా. భారత్ పై విధించిన 50 శాతం పనులు చాలా ఎక్కువగానే ఉన్నాయి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే ప్రధాని మోడీతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. మోడీ గొప్ప ప్రధాని. ఆయనతో నాకు వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉంది. కానీ ఆయన చేసే పనులు నాకు నచ్చడం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత్ తో అమెరికాకు అనుబంధం ఉంది. కనుక ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన ఏమీ లేదు. కొన్ని నెలల క్రితమే మోడీ అమెరికా వచ్చారు. అప్పుడు మేమిద్దరం రోజ్ గార్డెన్లో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించామని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ సానుకూల వైఖరి అభినందనీయం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత్ అమెరికా దేశాలకు మంచి భవిష్యత్తు ఉందని రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం :
