ఇక నాన్‌స్టాప్ వానలే వానలు.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదే వీడియో
నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. తూర్పు, పశ్చిమ, దక్షిణ మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు లక్షద్వీప్, కేరళ, మహే, కర్ణాటక, మాల్దీవులు, తమిళనాడు, తూర్పు మధ్య బంగాళాఖాతం, మిజోరం లోని కొన్ని ప్రాంతాల్లో మే 24న నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. సాధారణంగా జూన్ ఒకటో తేదీన దేశంలోకి ప్రవేశించే ఋతుపవనాలు ఈసారి వారం రోజులు ముందుగానే ఎంట్రీ ఇచ్చాయి.
ఋతుపవనాల రాకతో రాబోయే రెండు మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం మొత్తం, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని పలు ప్రాంతాలు, తమిళనాడు, పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, సిక్కిం లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 27 తేదీ నాటికి పశ్చిమ మధ్య దానిని ఆనుకొని ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానంలోని దక్షిణ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలోని రాగల మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం :
సరిగ్గా మూడు ముళ్లు వేసే టైంకి పెళ్లి కూతురు ట్విస్ట్.. ఆగిపోయిన పెళ్లి వీడియో
నటికి మామ రూ. 2,209 కోట్ల కానుకలు వీడియో
70 ఏళ్ల వ్యక్తి గాల్ బ్లాడర్ లో 8,125 రాళ్లు! లెక్కపెట్టడానికి 6 గంటలు వీడియో