Bullet Train Station: దేశంలోనే తొలి బుల్లెట్‌ రైల్వే స్టేషన్‌ అదిరిందిగా.! గ్లింప్స్‌‌ను షేర్‌ చేసిన రైల్వే మంత్రి.

|

Dec 11, 2023 | 9:20 AM

దేశంలో తొలి బుల్లెట్‌ రైల్వే స్టేషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ రైల్వే స్టేషన్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లోని ఈ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌‌ను రైల్వే మంత్రి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

దేశంలో తొలి బుల్లెట్‌ రైల్వే స్టేషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ రైల్వే స్టేషన్‌ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లోని ఈ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌‌ను రైల్వే మంత్రి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ముంబయి-ఆహ్మదాబాద్‌ మధ్య దేశంలోనే తొలిసారి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణం చేపట్టారు. దేశంలోని రెండు ఆర్థిక నగరాలను కలుపుతున్న ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు మేర కరకట్టలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. వీటి గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోవైపు ముంబయిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ స్టేషన్‌ సివిల్‌ వర్క్స్‌ దాదాపు 15శాతం పూర్తయ్యాయని నవంబరులో నేషనల్‌ హైస్పీడ్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మొత్తం బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో బీకేసీ పనులు ఇప్పటికే 15 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులోని ఏకైక అండర్‌గ్రౌండ్‌ స్టేషన్‌ ఇదే. 16 కోచ్‌ల బుల్లెట్‌ రైలు కోసం నిర్మించిన ఈ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.