మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు ఆల్ సెట్

Updated on: Jan 29, 2026 | 12:27 PM

భారత్-యూరోప్ మధ్య దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ డీల్ తుది దశకు చేరింది. ఈ ఒప్పందం అమలైతే యూరోపియన్ కార్లపై దిగుమతి సుంకాలు గణనీయంగా తగ్గి, వాటి ధరలు తగ్గుతాయి. మెర్సిడెస్, BMW, ఆడి వంటి లగ్జరీ కార్లు భారత మార్కెట్లో మరింత సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి.

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదరనున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) భారత ఆటోమొబైల్ మార్కెట్లో కీలక మార్పులకు నాంది పలకనుంది. దశాబ్దాలుగా చర్చల్లో ఉన్న ఈ డీల్ తుది దశకు చేరుకోగా, యూరోపియన్ కార్లపై ప్రస్తుతం ఉన్న 100-110 శాతం దిగుమతి సుంకాలు భారీగా తగ్గనున్నాయి. మొదటి దశలో సుమారు 40 శాతం వరకు సుంకం తగ్గే అవకాశం ఉంది, తదుపరి దశల్లో దీనిని 10 శాతానికి తగ్గించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ సుంకాల తగ్గింపుతో యూరోప్‌లో 30 లక్షల ధర పలికే కారు భారత్‌లో ప్రస్తుతం 70 లక్షలకు అమ్ముడవుతుండగా, FTA తర్వాత సుమారు 45-50 లక్షలకే లభించనుంది. Mercedes-Benz, BMW, Audi, Volvo, Volkswagen వంటి బ్రాండ్ల కార్లు ఇప్పుడున్న లగ్జరీ విభాగం నుండి మిడిల్ రేంజ్ విభాగంలోకి వస్తాయి.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌