Parnasala: తెలంగాణ అయోధ్యలో నిలువెత్తు నిర్లక్ష్యం.! పర్ణశాలలో విరిగిపోయిన విగ్రహాలు.

|

Jan 29, 2024 | 11:09 AM

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. తొలిరోజు సుమారు 5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తెలంగాణలోని భద్రాచలం జిల్లా వర్ణశాల పుణ్యక్షేత్రానికి అంతే విశిష్టత ఉంది. గోదావరి నదీ తీరంలో సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు వెలసిన పుణ్యక్షేత్రం వర్ణశాల.

అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. తొలిరోజు సుమారు 5 లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తెలంగాణలోని భద్రాచలం జిల్లా వర్ణశాల పుణ్యక్షేత్రానికి అంతే విశిష్టత ఉంది. గోదావరి నదీ తీరంలో సీతాలక్ష్మణ సమేతుడైన రాముడు వెలసిన పుణ్యక్షేత్రం వర్ణశాల. 14 సంవత్సరాల వనవాస కాలంలో చివరి రెండున్నర సంవత్సరాలు పర్ణశాలలో గడిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయానికి అనుబంధంగా దుమ్ముగూడెం మండలంలో ఈ పుణ్యక్షేత్రానికి పర్ణశాలకు అనేక ప్రాంతాల నుండి నిత్యం భక్తులు వస్తుంటారు. పర్ణశాలలోని పంచవటి కుటీరం, సీతరామ లక్ష్మణుల శిల్పాలు, మారువేషంలో సీతమ్మను అపహరించడానికి వచ్చిన రావణాసురుడి శిల్పాలు ఒకప్పుడు దైవ కళ ఉట్టిపడేలా ఉండేవి. ప్రస్తుతం శిల్పాలు విరిగిపోయి కళా హీనంగా ఉండటంతో ఎంతో భక్తితో వచ్చిన సందర్శకులు నొచ్చుకుని ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. పర్ణశాల అభివృద్ధిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు స్పందించి విరిగిపోతున్న శిల్పాలకు మరమ్మతులు చేయించి పూర్వ వైభవం తీసుకు రావాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos