Viral Video: హైనాల ప‌ట్టుద‌ల ముందు త‌ల‌వంచిన మృగ‌రాజు.. ప్ర‌శంస‌లు గుప్పిస్తున్న నెటిజ‌న్లు.

|

Sep 18, 2023 | 9:51 AM

బ‌ల‌వంతుడిదే రాజ్య‌మ‌న్న ఆట‌విక సూత్రాన్ని ఐక‌మ‌త్యంతో పటాపంచలు చేయ‌వ‌చ్చ‌ని హైనాల గ్యాంగ్ నిరూపించాయి. సింహం గుప్పిట్లో చిక్కి విల‌విల‌లాడుతున్న హైనాను తోటి జంతువులు కాపాడుకున్న తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ద‌క్షిణాఫ్రికాలోని స‌ఫారీ పార్క్‌లో జ‌రిగిన ఒళ్లు గ‌గుర్పొడిచే ఈ ఘ‌ట‌న‌ను మ్యాడీ లోవె కెమెరాలో చిత్రీక‌రించారు. ఆస్ట్రేలియాకు చెందిన‌ మార్గ‌ట్‌, మ్యాడీ లోవె స‌ఫారీని సంద‌ర్శించిన క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌ను రికార్డు చేశారు.

బ‌ల‌వంతుడిదే రాజ్య‌మ‌న్న ఆట‌విక సూత్రాన్ని ఐక‌మ‌త్యంతో పటాపంచలు చేయ‌వ‌చ్చ‌ని హైనాల గ్యాంగ్ నిరూపించాయి. సింహం గుప్పిట్లో చిక్కి విల‌విల‌లాడుతున్న హైనాను తోటి జంతువులు కాపాడుకున్న తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ద‌క్షిణాఫ్రికాలోని స‌ఫారీ పార్క్‌లో జ‌రిగిన ఒళ్లు గ‌గుర్పొడిచే ఈ ఘ‌ట‌న‌ను మ్యాడీ లోవె కెమెరాలో చిత్రీక‌రించారు. ఆస్ట్రేలియాకు చెందిన‌ మార్గ‌ట్‌, మ్యాడీ లోవె స‌ఫారీని సంద‌ర్శించిన క్ర‌మంలో ఈ ఘ‌ట‌న‌ను రికార్డు చేశారు. ఈ వీడియోలో హైనాల గుంపు ఉన్న ప్ర‌దేశానికి సింహం రావ‌డంతో భ‌య‌ప‌డిన హైనాలు పారిపోగా ఓ హైనాను సింహం వెంటాడి చేజిక్కించుకుంది. హైనాను నోటకరుచుకుని దాడి చేస్తుండ‌గా మిగిలిన హైనాలు సింహం మీద‌కు ఉరికి హైనాను కాపాడేందుకు ప్ర‌య‌త్నం చేసాయి. పలుమార్లు ప్ర‌యత్నించిన మీద‌ట హైనాను సింహం విడిచిపెట్ట‌డంతో హైనాల గుంపు వెనుదిరుగుతాయి. వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 20 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. హైనాను కాపాడుకునేందుకు హైనాల గుంపు ప్ర‌ద‌ర్శించిన స‌మ‌న్వ‌యం, పోరాట‌ప‌టిమ‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు గుప్పించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..