Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. ఆ తర్వాత

Updated on: Sep 15, 2025 | 4:29 PM

హైదరాబాద్‌కు చెందిన యోగా గురువు రంగారెడ్డి హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. చేవెళ్లలో యోగాశ్రమం నిర్వహిస్తున్నారు రంగారెడ్డి. అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. ముందస్తు పథకం ప్రకారం వారిని ఆశ్రమంలోకి పంపిన అమర్ గ్యాంగ్..ఆ ఇద్దరు ఆయనతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టగానే.. రంగంలోకి దిగింది.

రంగారెడ్డి.. ఆ మహిళలతో సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని ఫొటోలు, వీడియోలు తీసుకుని, తర్వాత ఆయనను బ్లాక్‌ మెయిల్ చేసింది అమర్‌ గ్యాంగ్. వారి బెదిరింపులకు భయపడిన రంగారెడ్డి.. అమర్ గ్యాంగ్‌కు రూ. 50 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే..2 కోట్లు ఇవ్వాలని అమర్ గ్యాంగ్ డిమాండ్ చేయటంతో.. రంగారెడ్డి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోగి దిగిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు

Prabhas: ‘మిరాయ్’కి ప్రభాస్ ఎంత తీసుకున్నారంటే..?

మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త మృతి

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానలే వానలు