Hyderabad: చిత్రమైన దొంగ.. ఏం తస్కరిస్తాడో తెలిస్తే అవాక్కవుతారు..

Updated on: May 14, 2025 | 11:27 AM

ఇతనో వెరైటీ దొంగ. పగలు క్యాటరింగ్ పనులకు వెళ్తాడు. రాత్రయితే చాలు తన చోర కళను ప్రదర్శిస్తాడు. అలా అని గోల్డ్, క్యాష్ వంటివి చోరీ చేయడు. తనకు ఓ వీక్‌నెస్ ఉంది. అవును.. ఇతను కేవలం సైకిల్స్‌ను మాత్రం టార్గెట్ చేస్తాడు.

దొంగల్లో చాలా రకాలు ఉంటారు. బంగారం, వెండి, నగలు కొట్టేసేవారు కొందరైతే.. వాహనాలు తస్కరించే వారు మరికొందరు. అయితే ఈ దొంగ చాలా డిఫరెంట్.. ఇంట్లోకి వెళ్లడు.. ఇంటి బయటే అతనికి పని.. అలా అని కార్లు, బైక్స్ కొట్టేస్తాడు అనుకునేరు. కేవలం సైకిళ్లను మాత్రమే తస్కరిస్తాడు. పట్టుకుంటే ఒళ్లు గుళ్లవుతుంది. అలానే పోలీసు కేసులు వెంటాడతాయి. అయినా కానీ అతను ఓన్లీ సైకిళ్లను మాత్రమే దొంగిలిస్తాడు. ఎందుకంటే అవే అతడి వీక్‌నెస్.  అవును.. హైదరాబాద్ ఉప్పల్‌లో సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి మూడు సైకిళ్లు రికవరీ చేశారు. ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సుంచు సల్మాన్ రాజు (46) ఆంధ్రప్రదేశ్ కర్నూల్ టౌన్‌కు చెందినవాడిగా గుర్తించారు. కుషాయిగూడలో ఉంటూ… పగలు క్యాటరింగ్ వర్క్ చేస్తూ.. రాత్రి అయితే సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో నిందితునిపై జవహర్ నగర్, కుషాయిగూడ, కీసర పోలీస్ స్టేషన్లలో సైకిల్ దొంగతనం కేసులు నమోదయినట్లు పోలీసలు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: May 14, 2025 08:48 AM