మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్‌ వీడియో

Updated on: Dec 25, 2025 | 3:30 PM

హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్ దాటి విస్తరిస్తున్న నేపథ్యంలో, మెట్రో రైలు సేవలను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మెట్రో నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న ఆలోచనను ముందుకు తీసుకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మెట్రో రెండో దశ విస్తరణకు భూసేకరణ అవసరం తక్కువగా ఉండనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

నాగోల్,ఎల్బీనగర్ మార్గం మీదుగా విమానాశ్రయం వరకు నిర్మించనున్న కారిడార్‌తో పాటు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టే మరో మార్గంలో మాత్రమే అధికంగా భూసేకరణ అవసరం ఉంటుందని సమాచారం. మిగతా కారిడార్లలో సుమారు 30 శాతం భూములు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. మెట్రో రెండో దశలో మొత్తం ఎనిమిది కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో పార్ట్-ఏ కింద ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.24,269 కోట్లను, పార్ట్-బీ కింద మూడు కారిడార్లలో 86.1 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.19,579 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును కేంద్రం–రాష్ట్రం కలిసి 50:50 జాయింట్ వెంచర్‌గా అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అన్ని కారిడార్లకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్‌ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో

చడీచప్పుడు కాకుండా కూతురి పెళ్లి చేసిన జగపతి బాబు వీడియో

భారీగా ఆశ చూపినా.. బిగ్ బాస్‌కు నో చెప్పిన రిషి సార్ వీడియో