Hyderabad: అమ్మ దొంగ.. గణేశ్ లడ్డూను సైలెంట్ తస్కరించాడు...

Hyderabad: అమ్మ దొంగ.. గణేశ్ లడ్డూను సైలెంట్ తస్కరించాడు…

Ram Naramaneni

|

Updated on: Sep 21, 2023 | 12:06 PM

దొంగలు పలు రకాలు. ఇళ్లలోని డబ్బు, బంగారం, లేదంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు కొందరు ఎత్తుకుపోతారు. అదీ కాదంటే..ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్‌లు, కార్లను మాయం చేస్తుంటారు. కానీ.. ఇతడు మరీ దారుణం. వినాయకుడి లడ్డూనే కొట్టేశాడు. ఎంతో భక్తితో పూజలు చేసి.. లంభోదరుడి నైవేధ్యంగా చేతిలో పెట్టిన లడ్డూను ఎత్తుకెళ్లిపోయాడు. అయితే ఈ దొంగతనం చేసే క్రమంలో సీసీ కెమేరాకు చిక్కాడు. 

మీరు వినాయకుడ్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారా…? అయితే మీకే ఈ అలెర్ట్. లడ్డూ దొంగలు.. విఘ్నేశ్వరుడి నైవేధ్యాన్ని కాజేసేందకు కాచుకు కూర్చున్నారు. నైట్ పూజ ఎవ్వరూ లేని సమయంలో చూసి.. లడ్డూలు ఎత్తేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ – మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో గణేష్ మండపం వద్ద పెట్టిన 11కేజీల లడ్డు దొంగతనం చేస్తూ ఓ యువకుడు సీసీటీవీ కెమెరాలలో దొరికాడు. బుధవారం తెల్లవారుజామున 4:20 గంటల ప్రాంతంలో 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న ఓ వ్యక్తి గణేష్‌ పండల్‌లోకి ప్రవేశించి లడ్డూను తస్కరించాడు. తాజాగా ఆ వీడియో వైరల్‌గా మారింది. మరీ దేవుడి లడ్డూ కూడా కొట్టేసిన ఈ దొంగను తిట్టి  పోస్టున్నారు నెటిజన్లు. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు అయ్యింది. లడ్డూ దొంగను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.