Watch: వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!

Edited By:

Updated on: Jan 31, 2026 | 6:23 PM

హైదరాబాద్‌లో వాహన చోరీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దొంగలు రోజురోజుకు మరింత అప్‌డేట్ అవుతున్నారు. తాజాగా బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద కేవలం 15 నుండి 20 సెకన్లలో ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

హైదరాబాద్‌లో వాహన చోరీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ దొంగలు కూడా తమ పద్ధతులను మార్చుకుంటూ, నూతన మార్గాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. చోరీల్లో తమకు తామే సాటి అనిపించుకునేలా కొందరు దొంగలు అద్భుత వేగంతో చోరీలు చేస్తున్నారు. జువెల్లరీ షాపుల నుంచి నగలు, దుకాణాల ముందు పార్క్ చేసిన బైకులను క్షణాల్లో అపహరిస్తున్నారు. తాజాగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కేవలం 15 నుండి 20 సెకన్ల వ్యవధిలోనే ఓ ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించారు. ఈ దొంగతనం దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. తన బైక్ చోరీకి గురికావడంతో బాధితుడు లబోదిబోమంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వాహనదారులలో ఆందోళన కలిగిస్తోంది.

Published on: Jan 31, 2026 06:21 PM