ఇలాగైతే బస్సు నడిపేదేలే.. నడిరోడ్డుపై నిలిపేసిన ఆర్టీసీ డ్రైవర్
ఆలస్యంగా వచ్చే రైళ్ల గురించి, కిక్కిరిసిన జనంతో కదలలేక కదలలేక కదిలే బస్సుల గురించి మనం సినిమాల్లో చూసాం. వాటిమీద పాటలు కూడా రాసారు మన సినీ కవులు. బండి బండి రైలూ బండి..టైముకు అసలు రాదూలెండి.. అని ఓ కవి అంటే... బండికాదు మొండి ఇది.. సాయం పంట్టండి.. అని మరో కవి వర్ణించాడు. సరిగ్గా అలాంటి సీనే జరిగింది కరీంనగర్ జిల్లాలో. ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది.
ఆలస్యంగా వచ్చే రైళ్ల గురించి, కిక్కిరిసిన జనంతో కదలలేక కదలలేక కదిలే బస్సుల గురించి మనం సినిమాల్లో చూసాం. వాటిమీద పాటలు కూడా రాసారు మన సినీ కవులు. బండి బండి రైలూ బండి..టైముకు అసలు రాదూలెండి.. అని ఓ కవి అంటే… బండికాదు మొండి ఇది.. సాయం పంట్టండి.. అని మరో కవి వర్ణించాడు. సరిగ్గా అలాంటి సీనే జరిగింది కరీంనగర్ జిల్లాలో. ఓ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. దాంతో లాగలేకలాగలేక లాగాడు ఆ బస్సుడ్రైవర్.. కానీ ఆ బస్సు మొండికేయడంతో నావల్ల కాదని చేతులెత్తేసాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్‌ను నడి రోడ్డుపై నిలిపివేశాడు డ్రైవర్. సిరిసిల్ల నుంచి వరంగల్‌కి వెళ్తున్న ఆర్టీసీ బస్ హుజురాబాద్ బస్టాండ్‌లో ప్రయాణీకులను ఎక్కించుకుని స్టార్ట్ అయ్యింది. బస్‌లో 55 మంది కెపాసిటీకి గాను 110 మంది ఎక్కారు. ఓవర్ లోడ్ అయిందని.. ఎంత చెప్పినా ప్రయాణికులు బస్సు దిగకపోవడంతో చేసేదేమిలేక అలానే బయటకు పోనిచ్చాడు డ్రైవర్. బస్సు రన్నింగ్‌లో, సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదు. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొంతమంది ప్రయాణీకులు దిగాలని డ్రైవర్ కోరారు. అతని మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా వినకపోడంతో డ్రైవర్ వరంగల్ రోడ్‌పై బస్సును నిలిపివేశాడు. కాసేపటి తర్వాత ఎట్టకేలకు ప్రయాణికులు సహకరించడంతో బస్సు ముందుకు కదిలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లల హాస్టలా ?? కోతుల హాస్టలా ?? విద్యార్ధులకోసం వండిన ఆహారాన్ని తినేస్తున్న వానరాలు
‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు