భార్యకోసం భర్త త్యాగం.. ఒంటికాలిపై 120 కి.మీ. నడిచిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా

|

Nov 05, 2023 | 9:50 PM

కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి కలకాలం కలిసి జీవిస్తామని ప్రమాణం చేసి స్త్రీ,పురుషులు వివాహ బంధంలోకి అడుగు పెడతారు. భారతదేశంలో వివాహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు చాటుతూనే ఉన్నారు. అందుకే పాశ్యాత్య దేశాల ప్రజలు సైతం హిందూ వివాహ వ్యవస్థవైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య అనారోగ్యం పాలైతే ఆమెకు అండగా నిలిచి, తను కోలుకుంటే తన గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇష్టదైవం ఆలయానికి నడిచి వస్తానని మొక్కుకున్నాడు.

కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచి కలకాలం కలిసి జీవిస్తామని ప్రమాణం చేసి స్త్రీ,పురుషులు వివాహ బంధంలోకి అడుగు పెడతారు. భారతదేశంలో వివాహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు చాటుతూనే ఉన్నారు. అందుకే పాశ్యాత్య దేశాల ప్రజలు సైతం హిందూ వివాహ వ్యవస్థవైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తన భార్య అనారోగ్యం పాలైతే ఆమెకు అండగా నిలిచి, తను కోలుకుంటే తన గ్రామానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇష్టదైవం ఆలయానికి నడిచి వస్తానని మొక్కుకున్నాడు. ఇందులో విశేషముంది అనుకుంటే పొరపాటే. అతను ఒంటికాలుతో నడిచి వెళ్లి మొక్కు తీర్చుకుని తన భార్య ఆరోగ్యం కుదుటపరచినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. భార్యకోసం అతను పడిన తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుణంపాలెం గ్రామానికి చెందిన కుప్పల స్వామి, సత్యవతి దంపతులు. భార్య సత్యవతికి ఆరోగ్యం క్షీణించింది. దీంతో తన భార్య ఆరోగ్యం బాగుపడాలని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మొక్కుకున్నాడు. భార్య అర్యోగం మెరుగు పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంచి మనసు చాటుకున్న టీ ఎస్టేట్‌ యజమాని !! ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి గిఫ్ట్‌లు..

ఊటీ టాయ్ ట్రైన్ రైడ్ ఆపేశారు.. ఎందుకో తెలుసా ??

ఊపిరితిత్తుల్లో సూది.. డాక్టర్లు ఎలా తీశారో తెలుసా ??

ఆదిలాబాద్‌ జిల్లాలో రోడ్లపై పులులు స్వైర విహారం..

బస్సు బీభత్స ఘటనలో ఒకరు దుర్మరణం.. కారు, బైకులు ధ్వంసం