Cyber Crime: ఒక్క మెసేజ్‌తో కోటిరూపాయలు కొల్లగొట్టారు

|

Sep 29, 2023 | 9:59 AM

సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ వస్తే అలర్ట్‌గా ఉండాలని ఎన్నిసార్లు చెబుతున్నా వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ మోసాలు వెలుగు చూశాయి. రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో బాధితులు ఏకంగా కోటి 8 లక్షల రూపాలయు పొగొట్టుకున్నారు. మణికొండలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఇంజనీర్‌కు గ్రాడ్యుయేట్ వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌తో మెసేజ్ వచ్చింది.

సైబర్ నేరాల పట్ల ప్రజలకు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, లింక్స్ వస్తే అలర్ట్‌గా ఉండాలని ఎన్నిసార్లు చెబుతున్నా వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ మోసాలు వెలుగు చూశాయి. రెండు వేర్వేరు సైబర్ మోసాల కేసుల్లో బాధితులు ఏకంగా కోటి 8 లక్షల రూపాలయు పొగొట్టుకున్నారు. మణికొండలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఇంజనీర్‌కు గ్రాడ్యుయేట్ వాట్సాప్‌లో పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌తో మెసేజ్ వచ్చింది. ఆ లింక్‌ను క్లిక్ చేసి, కాంటాక్ట్ అయిన మహిళ వారు చెప్పిన వివరాల ప్రకారం ఫాలో అయ్యింది. మొదట్లో ఆమె చేసిన పనికి జీతం సక్రమంగానే ఇచ్చారు. ఆ తరువాత ప్రమోషన్ పేరుతో ఆమెను టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా యాడ్ చేశారు. క్రమంగా పనులు ఇచ్చి.. ఆ పనులకు అమౌంట్ కూడా ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత మీరు కోటి 20 లక్షల రూపాయలు పొందే అద్భుత అవకాశం ఉందంటూ ఆమెలో ఆశలు కల్పించారు. అందుకు పని చేస్తూనే కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుందని సూచించారు. అలా పలు దఫాలుగా ఆమె నుంచి మొత్తం 59 లక్షలకు పైగా డబ్బు వసూలు చేశారు. మరో 40 లక్షలు చెల్లిస్తే ఆ మొత్తం కలిపి, డబుల్ అమౌంట్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. దాంతో అనుమానం వచ్చి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాగర్‌కు సరికొత్త అందం.. లేక్ ఫ్రంట్ పార్క్ రెడీ

వామ్మో.. కిటికీకి వేలాడుతూ కొండచిలువ.. ఏం చేశారో చూడండి

బాలీవుడ్ యాక్టర్ బలుపు మాటలు.. మరీ అంతొద్దు రాజా..

చడీచప్పుడు కాకుండా.. క్రిష్‌, బన్నీ నయా సినిమా ??

వీడియోలో.. షారుఖ్‌ను గడగడలాడించిన ప్రభాస్