నేర చరిత్ర ఉన్న రిసార్ట్‌లో బస? హనీమూన్ కోసం వెళ్లి.. అడవుల్లో అదృశ్యం
వారికి కొత్తగా పెళ్లయింది.. హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లారు. దట్టమైన అడవుల్లో అదృశ్యమయ్యారు. నవ దంపతుల ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మేఘాలయాలోని ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రెండు జంటలు అదృశ్యమయ్యాయి. అయితే ఈ అడవుల్లో చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా ఉంటాయని పోలీసులు తెలిపారు.
దట్టంగా చెట్లు, లోతైన లోయలు ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయన్నారు. ఓస్రా హిల్‌లో ఆ జంట చివరి లోకేషన్ నమోదైంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం అని పోలీసులు తెలిపారు. ఇక్కడ ఉండే ఓ రిసార్ట్‌కు నేర చరిత్ర ఉందని, దాని సిబ్బందిని విచారిస్తున్నామని పోలీసులు అన్నారు. హనీమూన్ కోసం వచ్చిన జంట ఈ రిసార్ట్‌లో సేద దీరారా? లేదా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ జంట అద్దెకు తీసుకున్న యాక్టివా నంబర్ ఆధారంగా.. దాని యజమానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్‌తో వివాహమైంది. హనీమూన్ కోసం మే 20న తమ ఇంటి నుంచి బయల్దేరారు. అసోం రాజధాని గువహటి మీదుగా షిల్లాంగ్ వెళ్లారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువహటిలో కామాఖ్యా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జంట గువహటి మీదుగా షిల్లాంగ్‌కు ప్రయాణించి, దాదాపు 60 కి.మీ దూరంలో ఉన్న చిరాపుంజి సందర్శించడానికి యాక్టివా బైక్‌ను అద్దెకు తీసుకున్నారు. దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. మరుసటి రోజు సోహ్రారిమ్ అనే గ్రామ సమీపంలో నవ దంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. రాజా, సోనమ్ అదృశ్యంపై అతని తల్లి రీనా స్పందించారు. తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్లు తెలిపారు. ఇక అప్పట్నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ లేకుండా పోయిందని విలపించారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్‌గా వచ్చాయి. దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు, బంధువులు కలిసి సోహ్రా ప్రాంతంలో గాలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజుకు 25 గంటలు..కాల గణనలో కొత్త పరిణామం..!
కోళ్లకు మేత వేద్దామని వెళ్లాడు.. అంతే.. ఒక్క దెబ్బకి..
‘ఆ కోవిడ్ పేషెంట్‌ను చంపేయ్’.. డాక్టర్ల ఫోన్ సంభాషణ వైరల్

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
