Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆ కోవిడ్‌ పేషెంట్‌ను చంపేయ్‌’.. డాక్టర్ల ఫోన్‌ సంభాషణ వైరల్‌

‘ఆ కోవిడ్‌ పేషెంట్‌ను చంపేయ్‌’.. డాక్టర్ల ఫోన్‌ సంభాషణ వైరల్‌

Phani CH

|

Updated on: Jun 05, 2025 | 4:32 PM

కోవిడ్‌ ట్రీట్మెంట్‌ తీసుకున్న ఓ మహిళా పేషెంట్‌ను.. చంపేయమంటూ ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నాడు తనని కలత పెట్టేలా డాక్టర్లు మాట్లాడారని ఫాతిమా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

2021లో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దయామి గౌసోద్దీన్ భార్య కౌసర్ ఫాతిమాకు కోవిడ్‌-19 సోకింది. దీంతో చికిత్స చేయించుకునేందుకు లాతూర్‌లోని ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో కోవిడ్‌ -19 కేర్‌ సెంటర్‌లో విధులు నిర్వహించిన డాక్టర్ డాంగే, అదనపు జిల్లా సర్జన్ డాక్టర్ దేశ్‌పాండే మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇటీవల సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కోవిడ్‌ వార్డ్‌లో పేషెంట్లకు డాక్టర్‌ డాంగే ట్రీట్మెంట్‌ ఇచ్చారు. ఫాతిమా పది రోజుల పాటు ఆ వార్డ్‌లో చికిత్స తీసుకున్నారు. అప్పట్లో ఆమెకు ఏడు రోజుల పాటు చికిత్స చేశారు. ఆ ట్రీట్ మెంట్ టైమ్ లో ఆ వార్డులో భోజనం చేస్తున్న డాక్టర్‌ డాంగే పక్కనే ఫాతిమా భర్త ఉన్నారు. ఆ సమయంలో డాక్టర్ డాంగేకు.. డాక్టర్ దేశ్‌పాండే ఫోన్‌ చేశారు. ఫోన్‌ స్పీకర్‌ ఆన్‌లోనే ఉంది. ఫోన్‌ మాట్లాడే సమయంలో కోవిడ్‌ వార్డ్‌లో బెడ్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు ఉన్నాయా? లేవా? అని అడిగారు. అందుకు డాక్టర్‌ డాంగే ఖాళీ బెడ్‌లు లేవని చెప్పారు. వెంటనే డాక్టర్ దేశ్‌పాండే జస్ట్‌ కిల్‌ దయామీ ఉమెన్‌ అని డాంగేతో అన్నారు. కోవిడ్‌ వార్డ్‌లోకి ఇంకా ఎవర్నీ అనుమతించొద్దు. జస్ట్‌ కిల్‌ దయామీ ఉమెన్‌ అని దేశ్‌ పాండే ఆదేశించగా.. అందుకు డాంగే.. ఆమెకు అందిస్తున్న ఆక్సిజన్‌ను మెల్లిమెల్లిగా తగ్గిస్తున్నట్లు చెప్పారు. దయామి రోగిని చంపేయండి. అలా చంపడం మీకు అలవాటే కదా’ అని చెప్పిన విషయాన్ని పక్కనే ఉన్న ఫాతిమా భర్త విన్నారు. కానీ ఏమీ అనలేకపోయారు. ఏమీ చేయలేకపోయారు. భార్యకు ట్రీట్మెంట్‌ అందుతున్న సమయంలో మాట్లాడటం కరెక్ట్‌ కాదనుకున్నారు. ఆ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఫాతిమా కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో ఉదయ్‌గిర్‌ సిటీ పోలీసులు డాక్టర్‌ దేశ్‌ పాండేపై మే 24న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అతని మొబైల్‌ను సీజ్‌ చేశారు. నోటీసులు జారీ చేసి అతని స్టేట్మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఆ ఆడియో క్లిప్‌ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై దిలీప్‌ గాడే తెలిపారు. డాక్టర్‌ డాంగే ప్రస్తుతానికి అందుబాటులో లేరనీ, ఆయనను కూడా తరువాత విచారిస్తామన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటపడ్డ మొసలి అస్థిపంజరం…కడుపు ఎక్స్‌రే తీసి చూడగా