పండుగ ఆనందం నింపాలేగానీ.. విషాదం మిగల్చకూడదు. ఇలా జరగొద్దంటే.. సింథటిక్ రంగులను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రంగుల తయారీలో రాగి, సిలికా, సీసం, ఆర్సెనిక్ వంటి అనేక విషపూరిత రసాయనాలు ఉపయోగిస్తారు. అలాగే.. మైకా, గాజు కణికలు, ఆస్బెస్టాస్ వంటి కొన్ని పదార్థాలను కూడా యూజ్ చేస్తారు. కాబట్టి.. వీటిని వాడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. గతంలో హోలీ రంగులు మోదుగు పూలతో తయారు చేసేవారు. ముగ్గు పిండిలో కలిపిన రంగులను నీటిలో కలిపి చల్లుకునేవారు. కానీ క్రమంగా ఈ పరిస్థితి మారిపోయింది. విషపూరిత రసాయనాలతో తయారైన రంగులు మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. మరి.. మీరు వేటిని వాడబోతున్నారు? ఆ రంగుల్లో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి? అనే విషయాలు తెలుసా?
హోలీ సింథటిక్ రంగుల కారణంగా.. చర్మం, కన్ను, శ్వాసనాళాలు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కళ్ల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని నేత్ర వైద్యులు సూచిస్తున్నారు. కలర్స్ వల్ల కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదమూ ఉందంటున్నారు. ఒకవేళ సింథటిక్ రంగులు వాడితే.. తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖం మీద నేరుగా రంగులు చల్లకూడదు. దీనివల్ల కంట్లోకి పోయి ఛాన్స్ ఉంటుంది. కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే.. కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతినే ఛాన్స్ ఉంది. కళ్లను శుభ్రపరిచినప్పటికీ సమస్య అలాగే ఉంటే.. వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. హోలీ రంగులలో ఉండే రసాయనాల వివిధ చర్మ అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.