చితిపై ఉంచగానే మృతదేహం నుంచి ఓంకారం

Updated on: Oct 16, 2025 | 8:11 PM

మానవ జీవితంలోని చివరి అంకం.. అంతిమ యాత్ర. ప్రతి మనిషి మృతి చెందిన తరువాత వారి కుటుంబ సభ్యులు వారి వారి ఆచారాలు సంప్రదాయాల ప్రకారం వారి యొక్క శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేస్తుంటారు. చనిపోయిన వ్యక్తిలో ఏమూలైనా ప్రాణం ఉండే అవకాశం ఉందనే భావనతో.. హిందువుల అంతిమ యాత్ర వేళ.. శ్మశానానికి వెళ్లే లోపు..పాడెను కిందకు దించి కొడుకు.. లేక అంత్యక్రియలు నిర్వహించే వ్యక్తితో చనిపొయిన వారి పేరును గట్టిగా పిలవమని చెబుతారు.

పిమ్మట.. స్మశానంలో చితిపై మృతదేహాన్ని పడుకోబెట్టి ఆవు నెయ్యి పోసి, గంధం చెక్కలు వేసి , నీటికుండతో కర్మ చేసే వ్యక్తి మూడు సార్లు ప్రదిక్షిణ చేస్తారు. తల కొరివి పెట్టిన తరువాత కపాలమోక్షం వరకు బంధు మిత్రులు అక్కడే ఉంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న స్మశానాలు ఇపుడు మురికి కూపాలు గా మారాయి. హిందూ సంప్రదాయంలో చావుకూడా పెళ్లిలాంటిదే అని చెబుతారు. అందుకే మనిషి అంతిమ యాత్ర కూడా అంతే సంతోషంగా జరగాలని, మనిషి చనిపోవడం ఎంతటి బాధాకరమైనా.. తన బంధువులంతా తన అంతిమ యాత్రలోపాల్గొని సంప్రదాయం ప్రకారం చివరి కర్మను జరిపిస్తే ఆ ఆత్మకు శాంతి చేకూరుతుంది. అందుకే ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు తన స్వంత నియోజకవర్గం పాలకొల్లు లో ని శ్మశాన వాటికలో ముక్కు మూసుకుని దహన సంస్కారాలను చేసే దుస్థితికి స్వస్థి పలకాలని చివరి మజిలీ కార్యక్రమం ఆహ్లాదమైన వాతావరణంలో, బంధు మిత్రులు సమక్షంలో జరిగే విధంగా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. కైలాసాన్ని తలపించేలా స్మశానవాటికను తీర్చి దిద్దారు. చితిపై మృతదేహాన్ని ఉంచగానే ఓంకార శబ్దం వచ్చే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదమైన ఒక సుందర పార్క్‌లా కైలాస వనాన్ని నిర్మించారు. పట్టణంలోను,చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా మృతి చెందితే తమ బంధువులు ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా పరిశుభ్ర వాతావరణంలో తమ ఆత్మీయుల అంత్యక్రియలు దగ్గర ఉండి జరిపించుకునేలా నిర్మించారు. అంతే కాదు సాక్షాత్తు ఆ పరమ శివుడు శ్మశాన సంచారం చేస్తారన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. దీంతో స్మశానంలో శివుని విగ్రహం తో పాటు ప్రత్యేకమైన రాతితో నిర్మించిన బల్లను ఏర్పాటు చేశారు. దీనిని ప్రత్యేకించి భువనేశ్వర్ లో తయారు చేయించి తీసుకువచ్చి శ్మశాన వాటికలో ఏర్పాటు చేశారు. దీనిపై దహన సంస్కారాలు చేసే పార్థీవ దేహాన్ని ఉంచితే ఓంకారం ధ్వనించేలా ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన టికెట్ ధర.. ఇక ఫిక్స్..

క్షణాల్లో కుప్పకూలిన కొత్త హైవే.. షాకైన జనం

ఇక.. రైలు టికెట్ ఇంటికే డెలివరీ

జపాన్‌ను వణికిస్తున్న మహమ్మారి.. ఆసియా అంతటా హై అలర్ట్‌

ఇక.. సులభంగా ఈపీఎఫ్‌ విత్‌ డ్రా.. ఎమర్జెన్సీలో 100 శాతం తీసుకోవచ్చు