78 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ గ్రామానికి తొలిబస్సు

Updated on: Jan 06, 2026 | 5:40 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా తుమాన్ గ్రామం 78 ఏళ్ల స్వతంత్రం తర్వాత తొలిసారి రోడ్డు, రవాణా సౌకర్యం పొందింది. దశాబ్దాలుగా రోడ్డు లేక ప్రజలు పడుతున్న కష్టాలకు తెరపడింది. తొలి బస్సు రాకతో గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బయ్యారు, స్వీట్లు పంచుకుని వేడుక చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం గ్రామాభివృద్ధికి కొత్త ఆశలు రేకెత్తించింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు గడిచినా, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా.. కొన్ని గ్రామాలు మాత్రం ఇంకా కుగ్రామాలుగానే మిగిలిపోతున్నాయి. రవాణా సౌకర్యం లేక, రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అలాంటి ఓ కుగ్రామానికి స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్ల తర్వాత తొలిసారి రోడ్డు, రవాణా సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఈ నేపథ్యంలో నేతలు, అధికారులతో కూడిన ట్రయల్‌ రన్‌ బస్సు రావడంతో గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చావాసి ప్రాంతంలోని తుమాన్ గ్రామానికి 78 ఏళ్లుగా ఎలాంటి రోడ్డు మార్గం లేదు. దీంతో దశాబ్దాలుగా ఆ గ్రామానికి ఎలాంటి రవాణా సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, షకెల్డ్ నుంచి తుమాన్ వరకు 2.7 కిలోమీటర్ల రహదారిని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నిర్మించింది. స్థానిక రాజకీయ నేతలు ఇటీవల ఆ రోడ్డును ప్రారంభించారు. దీంతో డిసెంబర్‌ 29న హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ తొలిసారి ట్రయల్ రన్‌ బస్సు నడిపింది. కర్సోగ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ గౌరవ్ మహాజన్ జెండా ఊపి షకెల్డ్ నుంచి తుమాన్‌కు బస్సును ప్రారంభించారు. రాజకీయ నేతలు, అధికారులు ఆ బస్సులో ప్రయాణించారు. మరోవైపు ఆ బస్సు తుమాన్‌ గ్రామానికి చేరుకోగా అక్కడ ఎదురుచూస్తున్న స్థానిక నేతలు, ప్రజలు చప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి వేడుక జరుపుకున్నారు. రోడ్డు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించిన పాలకులు, అధికారులకు ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

Bhagavanth Kesari: ఓటీటీలో టాప్ లో భగవంత్ కేసరి మూవీ

మాలీవుడ్‌కి గుడ్‌ న్యూస్‌.. రూ.100 కోట్ల క్లబ్‌లో ప్రేమమ్‌ హీరో

Yash: బర్త్ డే గిఫ్ట్.. టాక్సిక్‌ ట్రైలర్‌ రెడీ అవుతోందా

పరాశక్తికి దళపతి గ్రీన్‌ సిగ్నల్‌.. పొంగల్ రేసులో రెండు తమిళ చిత్రాలు